Homeఆరోగ్యంDried Fish Benefits | ఎండుచేపలు తింటున్నారా..?

Dried Fish Benefits | ఎండుచేపలు తింటున్నారా..?

  • ఇది తప్పకుండా తెలుసుకోండి..Dried Fish Benefits
  • సరైన జాగ్రత్తలు పాటించకుండా తినడం మంచిది కాదు..

చాలామందికి ఎండు చేపలు అంటే ఎంతో ఇష్టం. సీజన్‌తో సంబంధం లేకుండా వీటిని తినడానికి ఆసక్తి చూపుతుంటారు. ముఖ్యంగా చలికాలంలో చాలామంది ఎండు చేపలను (Dried Fish Benefits) తమ ఆహారంలో చేర్చుకుంటారు. మరి చలి వాతావరణంలో ఎండు చేపలు తినడం ఆరోగ్యానికి మంచిదేనా? ఆరోగ్య నిపుణుల ప్రకారం, సరైన జాగ్రత్తలు పాటిస్తూ తింటే ఇవి చలికాలంలో శరీరానికి అనేక రకాలుగా మేలు చేస్తాయి. ఎండు చేపలలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.ఎండు చేపలలో ప్రొటీన్, కాల్షియం, ఐరన్ అధికంగా ఉంటాయి. ఇవి చలికాలంలో శరీరానికి వెచ్చదనాన్ని, తగినంత శక్తిని అందిస్తాయి..

కాల్షియం వంటి పోషకాల వల్ల ఎముకలు గట్టిపడతాయి. అలాగే కీళ్ల నొప్పులు తగ్గడానికి కూడా ఇవి తోడ్పడతాయి. చలికాలంలో దగ్గు, జలుబు వంటి సమస్యలతో బాధపడేవారికి కూడా ఎండు చేపలు మంచి ఎంపికగా నిపుణులు పేర్కొంటున్నారు. తప్పనిసరిగా పాటించాల్సిన జాగ్రత్తలు: చలికాలంలో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ, నిల్వ,శుభ్రత విషయంలో అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. చలికాలంలో వాతావరణంలో తేమ ఎక్కువగా ఉంటుంది.

- Advertisement -

ఈ తేమ కారణంగా ఎండు చేపలపై త్వరగా బూజు వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల ఎండు చేపలను వండే ముందు అవి శుభ్రంగా ఉన్నాయా లేదా అని తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలి. బూజు పట్టినట్లు కనిపించినా లేదా అసాధారణమైన వాసన వస్తున్నా వాటిని అస్సలు ఉపయోగించకూడదు. ఎటువంటి చెడు వాసన రాకుండా, నాణ్యంగా, తాజాగా ఉన్నప్పుడు మాత్రమే ఎండు చేపలను తినడం ఆరోగ్యానికి సురక్షితం. సరైన శుభ్రత, జాగ్రత్తలతో చలికాలంలో ఎండు చేపల రుచిని, పోషకాలను ఆస్వాదించవచ్చు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News