విద్యార్థుల సంక్షేమం కోసం పలు కీలక డిమాండ్లతో డీజీవివైఎస్ శనివారం ఏడు అంశాల డిమాండ్ పత్రాన్ని విడుదల చేసింది. శనివారం రోజు దళిత గిరిజన విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డీజీవివైఎస్ కమిటీ ప్రెసిడెంట్ సర్దార్ సింగ్ మాట్లాడుతూ… ప్రభుత్వ పాఠశాలలు, ఉన్నత విద్యాసంస్థల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపర్చడంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన వసతులు కల్పించాలని కోరారు..

పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని, ఆదివాసీ ప్రాంతాల్లో మరిన్ని హాస్టళ్లను ఏర్పాటు చేయాలని, కాలేజీ హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం, డిగ్రీ విద్యార్థులకు ‘క్రిమి టెస్టర్’ వంటి ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావాలని, క్యాంపస్‌లలో భద్రతా చర్యలను బలోపేతం చేయాలని, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ప్రత్యేక ప్లేస్‌మెంట్ డ్రైవ్‌లు నిర్వహించి, ప్రైవేట్ యూనివర్సిటీల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే ఈ డిమాండ్లపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కిషన్, సైదులు, సందీప్, శ్రీనివాస్, శివ తదితరులు పాల్గొన్నారు.
