- సునీల్ బాబు, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ -1 ఆధ్వర్యంలో కార్యక్రమం..
- సూచనలు ఇచ్చిన నాహారం పోలీస్ స్టేషన్ సీఐ ధనుంజయ్..
యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండడంతో పాటు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని నాచారం పోలీస్ స్టేషన్ సీఐ దనుంజయ్ సూచించారు. మల్లాపూర్‌లోని బీసీ వెల్ఫేర్ హాస్టల్‌లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ -1 గురుబెల్లి సోమశంకర్ సునీల్ బాబు ఆధ్వర్యంలో, ఎస్‌ఎస్‌ఎస్ యువసేన సహకారంతో నాచారం పోలీసులు శుక్రవారం మాదకద్రవ్యాల నిర్మూలన, ట్రాఫిక్ భద్రత, మహిళల భద్రత, సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాల నివారణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఐ దనుంజయ్ మాట్లాడుతూ, మాదకద్రవ్యాల వల్ల యువత భవిష్యత్తు దెబ్బతింటుందని, వాటికి పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు.
ట్రాఫిక్ నిబంధనలను పాటించడం, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించడం, వేగ పరిమితులను పాటిస్తూ బాధ్యతాయుతంగా వాహనాలు నడపడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. గౌరవ అతిథిగా పాల్గొన్న ఎస్‌ఐ మైబెల్లి మాట్లాడుతూ, మహిళల పట్ల గౌరవ భావం కలిగి వారి భద్రతకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. అలాగే సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, లింకులు, సందేశాలను నమ్మి వ్యక్తిగత లేదా బ్యాంకు వివరాలు పంచుకోవద్దని విద్యార్థులకు వివరించారు.
సుమారు 120 నుంచి 130 మంది విద్యార్థులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులతో విద్యార్థులు పరస్పర చర్చ నిర్వహించి పలు సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మామిడాల సంతోష్ రెడ్డి, బాలరాజ్, కపర సాయి, గురు, అక్షంత్ పడాల, జోషిత్ యాదవ్, రామ్ పుప్పాల, జయంత్ తదితరులు పాల్గొన్నారు.
