- గీతానగర్ లో 1.5 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన గేట్లును పరిశీలించిన కార్పొరేటర్ శ్రవణ్
మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్ మంగళవారం మల్కాజిగిరి నియోజకవర్గం, మల్కాజిగిరి డివిజన్ పరిధిలోని గీతానగర్ లో సాయి టెక్స్టైల్స్ ఎదురుగా ఉన్నటువంటి సందులో ఇరువైపులా గేట్లు పెట్టే పనులను పరిశీలించడం జరిగినది.ఈ యొక్క సందు లేఔట్ లో ఉన్నప్పటికీ కూడా ఎవరూ వాడకపోవడంతో ఎంతోమంది చెత్త తెచ్చి వేయడము, అనేక అసాంఘిక కార్యక్రమాలకు నెలవుగా మారడం,గంజాయి అడ్డగా మారడంతో చెత్త పడకుండా గంజాయి అడ్డాగా మారకుండా మొదలు చివరను గేట్లు పెట్టి మూసి వేయడం జరుగుతున్నది.
గత అనేకసార్లుగా ఈ సందు శుభ్రం చేస్తున్నప్పుడు లారీలకొద్దీ చెత్త తీయడం జిహెచ్ఎంసి కి సైతం భారంగా మారింది.ఇటువంటి సమస్యల నుండి గేట్లు పెట్టడం ద్వారా ఉపశమనం లభిస్తుందని అన్నారు. కార్యక్రమంలో జిహెచ్ఎంసి ఏ.ఈ నవీన్, గుత్తేదారుడు నాయక్, నందు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
