మణుగూరు(Manuguru)లోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు(Brs Party Office)పై కాంగ్రెస్ (Congress) మూకలు చేసిన దాడిని పినపాక (Pinapaka) మాజీ ఎమ్మెల్యే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రేగా కాంతారావు (Rega Kantha Rao) ఖండించారు. డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్ (DMFT) నిధుల లెక్క అడిగినందుకే దాడికి పాల్పడ్డారని చెప్పారు. నిధుల లెక్కలు చెప్పలేక కాంగ్రెసోళ్లు భయపడి భౌతిక దాడులకు (Attack) దిగుతున్నారని విమర్శించారు. అయినప్పటికీ వాళ్లను వదలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. కేసీఆర్ (KCR) హయాంలో వందల కోట్ల డీఎంఎఫ్‌టీ ఫండ్స్ కేటాయించి జిల్లాను డెవలప్ చేశారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ నియోజకవర్గానికి కేటాయించాల్సిన రూ.200 కోట్లను రద్దు చేశారని పేర్కొన్నారు. ఇదేంటని అడిగితే అది ప్రభుత్వ విధానమని చెప్పటం ఎంత వరకు సబబు అని రేగా కాంతారావు నిలదీశారు.
