అక్టోబర్ 31న మంత్రి(Minister)గా ప్రమాణ స్వీకారం చేసిన అజారుద్దీన్‌కి మంగళవారం శాఖలు కేటాయించారు. మైనార్టీల సంక్షేమం(Minorities Welfare), పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ (Public Enterprises) శాఖలను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హోం శాఖ (Home Ministry) కోసం అజారుద్దీన్ పట్టుబడుతున్నారన్న వార్తలు దీంతో పటాపంచలయ్యాయి. ఆయన మాజీ క్రికెటర్ (Cricketer) కాబట్టి క్రీడల శాఖ (Ministry Of Sports) కేటాయించే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. చివరికి అది కూడా జరగలేదు. మైనార్టీ కోటా(Minority Quota)లో మంత్రివర్గం(Cabinet)లో చోటు దక్కించుకున్న అజారుద్దీన్‌కి సంబంధిత శాఖ ఇవ్వటం గమనార్హం. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో అక్కడ ఎక్కువ సంఖ్యలో ఉన్న ముస్లింల ఓట్ల కోసం ఆయన్ని కేబినెట్‌లోకి తీసుకున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇప్పుడు మైనార్టీల సంక్షేమ శాఖను కేటాయించడంతో అపొజిషన్ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తుందో చూడాలి.
