Homeరంగారెడ్డిComplaint | అప్పారెడ్డిగూడ ఉపసర్పంచ్ వ్యవహారంపై కలెక్టరేట్ లో ఫిర్యాదు

Complaint | అప్పారెడ్డిగూడ ఉపసర్పంచ్ వ్యవహారంపై కలెక్టరేట్ లో ఫిర్యాదు

మండల పరిధిలోని అప్పారెడ్డి గూడ గ్రామ ఉపసర్పంచ్ వ్యవహార శైలిపై గ్రామస్తులు సోమవారం కలెక్టరేట్ ప్రజాదర్బార్లో ఫిర్యాదు చేశారు. గ్రామంలో అభివృద్ధి పనుల విషయంలో వార్డు సభ్యులను సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారని, ప్రజలకు ఇబ్బందులు కలిగే విధంగా చర్యలు చేపడుతున్నారని గ్రామస్తులు ఆరోపించారు. నడిరోడ్డులో గడ్డివాములు, పశువులను ఏర్పాటు చేయడంతో ప్రజలకు సమస్యలు ఏర్పడుతున్నాయని తెలిపారు.

Complaint Filed Against Appareddyguda Deputy Sarpanch0 1

పంచాయతీ ఎన్నికలై కొద్దిరోజులే అయినప్పటికీ, గ్రామంలో సమన్వయం లోపించిందని, గ్రూపు రాజకీయాల వల్ల అభివృద్ధి నిలిచిపోయిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. మహిళా సర్పంచ్ ఉన్నప్పటికీ, అధికారాల వినియోగంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయని కొందరు వార్డు సభ్యులు తెలిపారు. ఈ అంశంపై అధికారులు విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కలెక్టర్ ను కోరారు. అప్పారెడ్డి గూడ గ్రామ వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, బాధిత గ్రామస్తులు ఫిర్యాదు ఇచ్చిన వారిలో ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News