Friday, April 17, 2026
Homeకెరీర్ న్యూస్పీజీ కోర్సుల్లో కామన్‌ క్రెడిట్ విధానం..

పీజీ కోర్సుల్లో కామన్‌ క్రెడిట్ విధానం..

  • నిర్ణయం తీసుకున్న వైస్ ఛాన్స్ లర్..

పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌(పీజీ) కోర్సుల్లో కామన్‌ క్రెడిట్‌ విధానాన్ని అమలుచేయాలని వైస్‌ చాన్స్‌లర్లు నిర్ణయం తీసుకున్నారు. రెండేండ్ల పీజీ కోర్సులో 88 క్రెడిట్లను అనుసరించాలని నిర్ణయించారు. 2026-27 విద్యాసంవత్సరంలో ఈ కొత్త క్రెడిట్‌ పాలసీ విధానాన్ని అమలుచేసేందుకు ఆమోదం తెలిపారు. సోమవారం మాసబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ వీ బాలకిష్టారెడ్డి, కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ శ్రీదేవసేన, పలు వర్సిటీల వీసీలు పాల్గొన్నారు. డిగ్రీలో కొత్తగా 36 అప్రెంటిస్‌షిప్‌ ఎంబీడెడ్‌ ప్రోగ్రామ్స్‌(ఏఐడీఈ) కోర్సులను ప్రవేశపెట్టేందుకు సమావేశం ఆమోదం తెలిపింది. మూడేండ్ల డిగ్రీ కోర్సుకు క్రెడిట్లు 120-126, ఏఐడీపీ కోర్సులో 130 -135 క్రెడిట్స్‌కు వీసీల సమావేశం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News