Homeకెరీర్ న్యూస్Telangana Intermediate Exam | ఇంటర్మీడియేట్ విద్యార్థులకు అలెర్ట్..

Telangana Intermediate Exam | ఇంటర్మీడియేట్ విద్యార్థులకు అలెర్ట్..

  • 2027 పబ్లిక్ పరీక్షల తాత్కాలిక టైం టేబిల్ విడుదల..Telangana Intermediate Exam
  • ఒకేషనల్ కోర్సుల పరీక్షలకు కూడా వర్తిస్తుంది..

తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ (Telangana Intermediate Exam) విద్యా మండలి 2027 ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన తాత్కాలిక టైమ్‌ టేబుల్‌ను విడుదల చేసింది. ఈ షెడ్యూల్ వొకేషనల్ కోర్సుల పరీక్షలకు కూడా వర్తిస్తుందని, అయితే వాటి ప్రత్యేక టైమ్‌టేబుల్‌ను వేరుగా జారీ చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. విద్యార్థులు తమ ప్రిపరేషన్‌ను మరింత వేగవంతం చేయడానికి ఈ తాత్కాలిక షెడ్యూల్ ఎంతో ఉపయోగపడుతుంది. ప్రాక్టికల్ పరీక్షలు, అంతర్గత మూల్యాంకనం విషయానికి వస్తే, ఫస్ట్ ఇయర్ ఇంటర్నల్ అసెస్‌మెంట్‌ను 20-01-2027 నుంచి 25-01-2027 వరకు నిర్వహిస్తారు. ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష 27-01-2027 ఉదయం 10.00 నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు జరుగుతుంది.

ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్ష 29-01-2027 ఉదయం 10.00 నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు నిర్వహిస్తారు. ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ ఫస్ట్ ఇయర్‌కు 29-01-2027న, సెకండ్ ఇయర్‌కు 30-01-2027న జరుగుతాయి. సెకండ్ ఇయర్ సైన్స్ సబ్జెక్టుల ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 10 వరకు ఆదివారాలతో సహా రెండు సెషన్లలో ఉదయం 9.00 నుంచి 12.00 వరకు, మధ్యాహ్నం 2.00 నుంచి 5.00 వరకు జరుగుతాయి. కొత్త విధానం ప్రకారం ఫస్ట్ ఇయర్ సైన్స్ సబ్జెక్టుల ప్రాక్టికల్స్ 11-02-2027 నుంచి 18-02-2027 వరకు ఆదివారంతో సహా ప్రతి సెషన్ రెండు గంటల చొప్పున మూడు సెషన్లలో నిర్వహించనున్నారు.

- Advertisement -

థియరీ పరీక్షలన్నీ ఉదయం 9.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు జరుగుతాయి. ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు 24-02-2027న 2వ లాంగ్వేజ్ పేపర్-1తో మొదలై, 26-02-2027న ఇంగ్లీష్ పేపర్-1, 02-03-2027న మ్యాథమెటిక్స్ పేపర్-1A, బోటనీ పేపర్-1, పొలిటికల్ సైన్స్ పేపర్-1, ACE గ్రూప్‌కు అకౌంటెన్సీ పేపర్-1 పరీక్షలు జరుగుతాయి. 05-03-2027న మ్యాథమెటిక్స్ పేపర్-1B, జువాలజీ పేపర్-1, హిస్టరీ పేపర్-1, ACE గ్రూప్‌కు కామర్స్ పేపర్-1 ఉంటాయి. 09-03-2027న ఫిజిక్స్ పేపర్-1, ఎకనామిక్స్ పేపర్-1, 15-03-2027న కెమిస్ట్రీ పేపర్-1, కామర్స్ & అకౌంటెన్సీ పేపర్-1, 17-03-2027న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-1, MEC గ్రూప్‌కు మ్యాథమెటిక్స్ పేపర్-1, ఇక చివరి రోజు 19-03-2027న మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-1, జాగ్రఫీ పేపర్-1, బైపీసీ విద్యార్థుల కోసం బ్రిడ్జ్ కోర్స్ మ్యాథమెటిక్స్ పేపర్-1 పరీక్షలతో ఫస్ట్ ఇయర్ థియరీ పరీక్షలు ముగుస్తాయి.

అలాగే సెకండ్ ఇయర్ థియరీ పరీక్షలు 25-02-2027న 2వ లాంగ్వేజ్ పేపర్-2తో ప్రారంభమవుతాయి. 27-02-2027న ఇంగ్లీష్ పేపర్-2, 03-03-2027న మ్యాథమెటిక్స్ పేపర్-2A, బోటనీ పేపర్-2, పొలిటికల్ సైన్స్ పేపర్-2, 08-03-2027న మ్యాథమెటిక్స్ పేపర్-2B, జువాలజీ పేపర్-2, హిస్టరీ పేపర్-2 పరీక్షలు జరగనున్నాయి. 12-03-2027న ఫిజిక్స్ పేపర్-2, ఎకనామిక్స్ పేపర్-2, 16-03-2027న కెమిస్ట్రీ పేపర్-2, కామర్స్ & అకౌంటెన్సీ పేపర్-2, 18-03-2027న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-2, చివరగా 20-03-2027న మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-2, జాగ్రఫీ పేపర్-2, బైపీసీ విద్యార్థుల కోసం బ్రిడ్జ్ కోర్స్ మ్యాథమెటిక్స్ పేపర్-2 పరీక్షలతో సెకండ్ ఇయర్ పరీక్షలు పూర్తవుతాయి.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News