Homeకరీంనగర్ప్యారడైజ్ సెయింట్ జార్జ్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం

ప్యారడైజ్ సెయింట్ జార్జ్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం

కరీంనగర్లోని ప్యారడైజ్ సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ పాఠశాలలో శుక్రవారం రోజున బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పారడైజ్ సెయింట్ జార్జ్ (సీబీఎస్సీ) పాఠశాలల చైర్మన్ డా.పి.ఫాతిమా రెడ్డి విచ్చేసి నెహ్రూ చిత్రపటానికి పూలమాలవేసి వేడుకలను ప్రారంభించారు. విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తరగతులు నిర్వహించడం జరిగింది. ఉపాధ్యాయులు విద్యార్థులుగా అసెంబ్లీ ఆహ్లాదకరంగా జరిపారు చిన్నారులు నెహ్రూ వేషధారాలతో సందడి చేశారు.

childrens day celebrations paradise st george school karimnagar 1

విద్యానగర్ లోని నినోస్ బ్లాక్ లో తల్లిదండ్రులకు ఆహ్లాదకరమైన ఆటలు నిర్వహించారు, తీగలగుట్టపల్లి నినోస్ బ్లాక్ లో పర్యావరణ పరిరక్షణపై ర్యాలీ చేపట్టి చెట్లు నాటారు రేకుర్తిలోని నినోస్ బ్లాక్ లో విద్యార్థులు పలు రకాలైన ప్రాజెక్టుల ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్స్ వసంత , భార్గవ్ ప్రియదర్శని , వైస్ ప్రిన్సిపల్స్ మధు , ప్రసాద్ రెడ్డి , నిరంజన్ పవర్ కిడ్స్ ఇంచార్జ్ సంధ్య నినోస్ బ్లాక్ ఇంచార్జీలు సంగీత ,సంధ్య గ స్వప్న తదితరులు పాల్గొన్నారు

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES

Latest News