- కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి పీఠం అధిష్టించాలి
- తెలంగాణ ప్రజలు, రైతాంగం సుభిక్షంగా వర్ధిల్లాలి
- అమ్మవారి సన్నిధిలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు శివరాజ్ పాటిల్ ప్రత్యేక ప్రార్థనలు
సదాశివపేట: దేశంలోనే అత్యంత మహిమాన్వితమైన శక్తిక్షేత్రం అస్సాం శ్రీ కామాఖ్య దేవి ఆలయంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు(BRS Leaders) శివరాజ్ పాటిల్ పార్టీ ముఖ్య నేతలతో కలిసి వైభవంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల సమక్షంలో శాస్త్రోక్తంగా అమ్మవారికి అభిషేకాలు, విశేష అర్చనలు జరిపించారు.
ఈ సందర్భంగా శివరాజ్ పాటిల్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సంక్షేమం దృష్ట్యా బీఆర్ఎస్(BRS Leaders) పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చి కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలని అమ్మవారిని వేడుకున్నట్లు స్పష్టం చేశారు. అలాగే నియోజకవర్గ ప్రజలకు సమృద్ధిగా వర్షాలు కురిసి, పంటలు బాగా పండి ప్రతి కుటుంబం ఆర్థికంగా సుసంపన్నం కావాలని ఆకాంక్షించారు. భవిష్యత్లో ప్రజాసేవలో తనకు మరిన్ని మంచి రాజకీయ అవకాశాలు దక్కాలని కూడా ప్రార్థించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు అమరేందర్ రెడ్డి, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు విద్యాసాగర్ రెడ్డి, ఇంద్రమోహన్ గౌడ్, మాజీ కో-ఆప్షన్ సభ్యులు కోడూరి అంజయ్య మరియు ప్రేమ్చంద్ తదితరులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
