Homeనల్లగొండTG Reddy Community | రాష్ట్ర యూత్ వైస్ ప్రెసిడెంట్‌గా గాయం సైదిరెడ్డి నియామకం

TG Reddy Community | రాష్ట్ర యూత్ వైస్ ప్రెసిడెంట్‌గా గాయం సైదిరెడ్డి నియామకం

మఠంపల్లి: తెలంగాణ రెడ్డి సంఘం రాష్ట్ర యూత్ వైస్ ప్రెసిడెంట్‌గా మఠంపల్లి మండలంలోని పెదవీడు గ్రామానికి చెందిన గాయం సైదిరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని చంపాపేటలో ఉన్న తెలంగాణ రెడ్డి సంఘం(TG Reddy Community) రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఆదివారం ఆయనకు రాష్ట్ర రెడ్డి సంఘం నాయకులు నియామక పత్రాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా సైదిరెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర యూత్ వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షుడు బద్దూరి వెంకటేశ్వర్ రెడ్డి, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కొట్టం మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర యూత్ అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డితో పాటు రెడ్డి బంధువులకు కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన పేద రెడ్డి కుటుంబాల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పనిచేస్తానని పేర్కొన్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై అర్హులకు అవగాహన కల్పించడం, రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు కోసం కృషి చేయడం, విదేశీ విద్యకు అవసరమైన సహాయం అందేలా చర్యలు తీసుకోవడం, అర్హులైన పేద కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా అవగాహన కల్పించడం వంటి అంశాలపై సంఘం ద్వారా నిరంతరం కృషి చేస్తానన్నారు.

- Advertisement -

పేద రెడ్డి కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి ప్రభుత్వం, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు అండగా నిలవడంతో పాటు తెలంగాణ రెడ్డి సంఘం(TG Reddy Community) ఐక్యత,బలోపేతం, అభివృద్ధి కోసం నాయకత్వంతో కలిసి పనిచేస్తానన్నారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ సంఘం లక్ష్యాల సాధనకు కృషి చేస్తానని సైదిరెడ్డి స్పష్టం చేశారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News