Thursday, January 22, 2026
EPAPER
HomeజాతీయంNitin Nabin | బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్

Nitin Nabin | బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్

బీజేపీ జాతీయ అధ్యక్షుడి(Bjp National Presedent)గా బీహార్ క్యాబినెట్ మంత్రి (Bihar Cabinet Minister) నితిన్ నబిన్‌ను నియమించారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు (BJP Parliamentary Board) ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ నియామకం తక్షణం అమల్లోకి వస్తుందని పేర్కొంది. దీంతో.. 2020 జనవరి నుంచి అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డా (JP Nadda) స్థానంలో ఈయన బాధ్యతలు చేపట్టనున్నారు. 45 ఏళ్ల నితిన్ నబిన్ అతి చిన్న వయసులో బీజేపీ అధ్యక్షుడైనవారిలో ఒకరిగా నిలిచారు. బీహార్‌లో 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈయన పలుమార్లు మంత్రిగా చేశారు. ప్రస్తుతం పాట్నాలోని బంకిపూర్ ఎమ్మెల్యేగా ఉన్న నితిన్ నబిన్.. పీడబ్ల్యూడీ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. బీజేపీ అధ్యక్షుడిగా నియమితుడైన నితిన్ నబిన్‌కి ప్రధాని మోదీ (PM Modia) అభినందనలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News