HomeఫోటోలుBhagavanthudu | మూవీ నుంచి 'శరణమన్న శరణం' సాంగ్ రిలీజ్

Bhagavanthudu | మూవీ నుంచి ‘శరణమన్న శరణం’ సాంగ్ రిలీజ్

యంగ్ టాలెంటెడ్ హీరో తిరువీర్ నటిస్తున్న కొత్త సినిమా “భగవంతుడు”. ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తోంది. కన్నడ నటుడు రిషి ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను పనస శంకరయ్య గౌడ్ సమర్పణలో రవి పనస ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1గా నిర్మిస్తున్నారు ప్రొడ్యూసర్ రవి పనస. ఈ సినిమాతో జి.జి. విహారి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రొమాంటిక్ పీరియడ్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న “భగవంతుడు” సినిమా త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం నుంచి ‘శరణమన్న శరణం’ సాంగ్ రిలీజ్ చేశారు.

Bhagavanthudu May Day Song Release

శ్రామిక శక్తికి నమస్కరిస్తూ ‘శరణమన్న శరణం’ పాటను రూపొందించారు. ఈ పాటకు హాయ్ కే.పి స్ఫూర్తికరంగా కంపోజ్ చేయగా, సింగర్ కుమార వాగ్దేవి పాటలోని భావోద్వేగాలను పలికిస్తూ పాడారు. ఈ పాట గురించి “భగవంతుడు” మేకర్స్ స్పందిస్తూ – మన మట్టిలో ప్రతి పని ఒక అమ్మ దేవత సాక్షిగానే మొదలవుతుంది. పొలం గట్టున నాగలి సాగేముందు ‘పోలేరమ్మ’ను, చెరువు కట్టపై అలుగులు పోసేటప్పుడు ‘గంగమ్మ’ను, కష్ట, సుఖాల్లో ‘ఎల్లమ్మ’ను స్మరించుకోవడం మన శ్రామిక సంస్కృతిలో భాగం. ఈ అమ్మ దేవతలు శ్రామికుల చెమట చుక్కల్లో తోడుండే ధైర్య రూపాలు.

- Advertisement -
Bhagavanthudu May Day Song Release2

మన సంస్కృతిలో అమ్మ దేవతల శరణుజొచ్చంది ఏ పనీ మొదలు కాదు. పూర్తి కాదు. అమ్మలకు, సబ్బండ వర్గాలకు ఘనమైన ట్రిబ్యూటే మా ఈ “శరణమన్న శరణం”. ఇది నాగలి పట్టిన రైతు, సుత్తి పట్టిన కమ్మరి, చక్రం తిప్పిన కుమ్మరి… ఇలా సకల సబ్బండ కులాల శ్రమజీవుల గుండె చప్పుడు. రక్తాన్ని చెమటగా మార్చి, ఉత్పత్తి చేసే మట్టి చేతులకు, మట్టి చేతులు మోసే పనిముట్లకు నివాళి ఈ గీతం. ఇది ఈ దేశపు సబ్బండ కులాల పతాక గీతం. శ్రమను, తల్లిని ప్రేమించే, పూజించే వారి బతుకు గీతం. మట్టి మనుషులకి వారిని కంటికి రెప్పలా కాపాడే అమ్మ దేవతలకీ మే డే సందర్భంగా మా వందనం. అంటూ కార్మిక లోకానికి సెల్యూట్ చేశారు.

నటీనటులు – తిరువీర్, ఫరియా అబ్దుల్లా, రిషిలతో పాటు రవీందర్ విజయ్, షెల్లీ కిషోర్, కాలకేయ ప్రభాకర్, చిరాగ్ జానీ తదితరులు

టెక్నికల్ టీమ్

కాస్ట్యూమ్ డిజైనర్ – ఆయేషా మరియం
యాక్షన్ – రామ్ కిషన్, రాబిన్ సుబ్బు
లిరిక్స్ – చంద్రబోస్, గోరెటి వెంకన్న, కాసర్ల శ్యామ్,
కొరియోగ్రఫీ – ఈశ్వర్ పెంటి
సినిమాటోగ్రఫీ – రాజ్ తోట
మ్యూజిక్ : హాయ్ కె.పి
ప్రొడక్షన్ డిజైనర్ – గాంధీ నడికుడికర్
ఎడిటర్ – ప్రవీణ్ పూడి
సమర్పణ – పనస శంకరయ్య గౌడ్
బ్యానర్ – రవి పనస ఫిలిం కార్పొరేషన్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
నిర్మాత – రవి పనస
స్టోరీ, డైరెక్షన్ – జి.జి.విహారి

- Advertisement -
RELATED ARTICLES

Latest News