Saturday, May 2, 2026
Homeసాహిత్యంDevika | సినిమాల్లో సఫలం…. వైవాహిక జీవితంలో విఫలం

Devika | సినిమాల్లో సఫలం…. వైవాహిక జీవితంలో విఫలం

  • సావిత్రి లాగే దేవిక జీవితం దుఖాంతం
  • మే 2…అలనాటి అందాల నటి దేవిక జయంతి

సినిమా పరిశ్రమలో చాలామంది కథానాయికలు తమ అందచందాలతో, గ్లామర్ తో, హావ భావాలతో, శారీరిక సౌష్టవంతో నటనతో రాణించి, ప్రేక్షకుల హృదయాలను దోచి, చిత్రాలను బాక్సాఫీస్ రికార్డులపరం చేసి, నిర్మాతలకు ఊహించని డబ్బులు సంపాదించి పెట్టారు. అయితే కొందరు అదే సమయాలలో, కారణాలు ఏవైనా, మహానటి సావిత్రి లాగా తమ వైవాహిక జీవితంలో చేసిన తప్పుల కారణంగా భారీగా మూల్యం చెల్లించుకున్న ఘటనలను కూడా ఇప్పటివరకు లేక పోలేదు. అలాంటి కొద్దిమంది అభాగినులలో అలనాటి మేటి నటి దేవిక ఒకరు.

దేవిక (1943 – మే 2, 2002) ఒకనాటి తెలుగు సినిమా బిజీ నటి. 1960, 70 దశకాలలో అందాల తారగా తెలుగు, తమిళ సినీరంగాలలో వెలుగొందింది. తెలుగు, తమిళ, మలయాళంలలో 150కి పైగా సినిమాలలో నటించింది. చిత్తూరు జిల్లా చంద్రగిరి ప్రాంతానికి చెందిన దేవిక అసలు పేరు ప్రమీలాదేవి.

- Advertisement -

ఎన్టీస్ రామారావుతో కథానాయిక గా రేచుక్క అనే సినిమాలో తొలిసారి నటించింది. అత్తా ఒకింటి కోడలే, కంచుకోట, ఆడ బ్రతుకు సినిమాలు ఆమెకు ఎంతో గుర్తింపు తెచ్చి పెట్టాయి. ఎన్.టి.రామారావు నిర్మించిన శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర సినిమాలో చివరి సారిగా నటించారు. ఆమె తెలుగు సినిమాకు ఆద్యునిగా భావించే రఘుపతి వెంకయ్య బంధువు.

మొదట రంగస్థల నటిగా జీవితాన్ని ప్రారంభించిన దేవిక ఎస్.వి.సహస్రనామం బృందం ప్రదర్శించిన అనేక నాటకాలలో వివిధ పాత్రలు పోషించింది. ముక్తా శ్రీనివాసన్ దర్శకత్వం వహించిన ముదలలిలో నటించిన తర్వాత దేవిక సినీరంగంలో ప్రాచుర్యం పొందింది. ఆ సమయంలోనే ఈమె అందానికి, నటనకు ముగ్ధులైన సినీరంగానికి చెందిన కొందరు దేవికకు పిలిచి సినీ అవకాశాలు ఇచ్చారు.

ఈమె ఎన్టీ రామారావుతో హీరోయిన్‌గా ‘రేచుక్క’ అనే సినిమాలో తొలిసారి నటించింది. ఆ తర్వాత తెలుగు, తమిళ, మలయాళంలలో 150కి పైగా సినిమాలలో నటించింది. 1960, 70 దశకాలలో అందాల తారగా తెలుగు, తమిళ సినీరంగాలలో వెలుగొందింది.

అయితే అప్పట్లో నటి దేవిక తెలుగు, తమిళ భాషలలోని స్టార్ హీరోలతో వరుస చిత్రాలతో నటిస్తూ బాగానే రాణించింది. దీంతో తెలుగు, తమిళంలో బాగా పేరొందిన ఓ స్టార్ హీరోయిన్ దేవిక కు సినిమా అవకాశాల విషయంలో అడ్డు పడుతున్నారని అప్పట్లో టాక్ వినిపించింది.

అయితే ఎందరికో సినీ పరిశ్రమలో చేయూ తను అందించిన నందమూరి తారక రామా రావు… మాత్రం దేవికకు దాదాపుగా తెలుగులో 20 కి పైగా చిత్రాలలో నటించే అవకాశాలను ఇప్పించారు. అంతగా వీరిద్దరి మధ్య చాలా సాన్నిహిత్యం ఉండేదని అప్పట్లో అంటుండేవారు. అయితే వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతున్న సమయంలో దేవిక సినిమా పరిశ్రమలో పలు చిత్రాలకు అసిస్టెంట్ దర్శకుడిగా పని చేసిన “దేవదాసు” అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.

తర్వాత తన భర్తని దర్శకుడిగా సినిమా పరిశ్రమకు పరిచయం చేసేందుకుగాను తాను కష్టపడి కూడబెట్టుకున్న ఆస్తులను అమ్మేసింది. అయినప్పటికీ తన భర్త మాత్రం ప్రేక్షకులను ఊహించిన విధంగా రాణించలేక పోయాడు. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు, విభేదాలు వచ్చాయి. తర్వాత తమిళ సినిమాల్లో నటించిన తన కూతురు కనక తో కలిసి కడు బాధా కరమైన శేష జీవితం గడిపింది.

శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర (1984), ఆడవాళ్ళు అలిగితే (1983), నయా దిన్ నయీ రాత్ (1974) (హిందీ), పాపం పసివాడు (1972), చిన్ననాటి స్నేహితులు (1971), ఇజ్జత్ (1968) (హిందీ), నిలువు దోపిడి (1968), భామా విజయం (1967), శ్రీకృష్ణా వతారం (1967) – రుక్మిణీ, తిరువిల యాడల్ (1965) (తమిళం) – శెంబగ పాండ్యన్ భార్య, పెంపుడు కూతురు (1963), కర్ణ (1963) – శుభాంగి, రక్త సంబంధం (1962), మహామంత్రి తిమ్మరుసు (1962) – అన్నపూర్ణ, దక్షయజ్ఞం (1962) – సతీదేవి, గాలిమేడలు (1962), బలే పాండియ (1962), బంధ పాశమ్ (1962) (తమిళం), మన్ మౌజీ (1962) (హిందీ), నెంజిల్ ఒరే ఆలయమ్ (1962) (తమిళం) – సీత, టాక్సీ రాముడు (1961), పెండ్లి పిలుపు (1961), ఘరానా (1961) (హిందీ), పాప పరిహారం (1961), పావమణిప్పు (1961) (తమిళం) – క్రైస్తవ సహాయకురాలు, శభాష్ రాజా (1961), మాంగల్యం (1960), సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి (1960), శాంతి నివాసం (1960), శభాష్ రాముడు (1959), ఘర్ సస్సార్ (1958) (హిందీ) – భారతి, వరుడు కావాలి (1957), రేచుక్క (1954) – లలితాదేవి తదితర చిత్రాలలో విభిన్న పాత్రలు పోషించి ప్రేక్షకుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచి పోయింది.

ఎన్.టి.రామారావు నిర్మించిన ‘శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర’ సినిమాలో చివరి సారిగా నటించింది. ఆ తర్వాత సినీ పరిశ్రమకు దూరమైంది. 2002 మే 2వ తేదీ తెల్లవారు జామున మద్రాసులోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో అస్వస్థతతో మరణించింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News