Tuesday, November 11, 2025
ePaper
Homeహైదరాబాద్‌Hyderabad | బీసీ జేఏసీ సమావేశం

Hyderabad | బీసీ జేఏసీ సమావేశం

ఈ రోజు హైదరాబాద్ బంజారా హిల్స్ లోని కళింగ భవన్ లో బీసీ జేఏసీ (Bc Jac) కో చైర్మన్ దాసు సురేశ్, వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ సంయుక్త నేతృత్వంలో బీసీ జేఏసీ విస్తృత స్థాయి సమావేశం విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా దాసు సురేశ్ మాట్లాడుతూ.. 42% రిజర్వేషన్లు (Reservations) అమలయ్యేదాక ఉద్యమ తీవ్రత తగ్గదని చెప్పారు. 42% బీసీ రిజర్వేషన్లను తక్షణమే అమలుచేయాలని డిమాండ్ (Demand) చేశారు. 42 శాతం రిజర్వేషన్లు అమలయ్యే స్థానం పార్లమెంటే. ఈడబ్ల్యూఎస్ (Ews) రిజర్వేషన్లు మాదిరిగానే బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు రాజ్యాంగ సవరణ ద్వారా అమలు కావాల్సిందేనని తెలిపారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లే ఆదర్శం బీసీ రిజర్వేషన్లు 42 శాతం సాధించేందుకు అని అన్నారు.

ఆయన ఇంకా ఏమన్నారంటే..

రిజర్వేషన్లు అమలు చేయటానికి పార్లమెంటు(Parliament)లో ప్రైవేటు బిల్లు (Private Bill) పెట్టడం ఇండి కూటమి కూడగట్టే బాధ్యత రాహుల్ గాంధీదే(Rahul Gandhi). పార్లమెంట్ బయట ఎన్ని ధర్నాలు దీక్షలు చేసిన సమసిపోదు దీనికి పరిష్కారం పార్లమెంట్ కేంద్రంగా ఉంది. ముఖ్యమంత్రి నాయకత్వం వహించి బీసీ జేఏసీ, అఖిలపక్షంను రాహుల్ గాంధీతో సమావేశపరచాలి. అసెంబ్లీలో బీసీ బిల్లు సంపూర్ణంగా ఆమోదించిన పార్టీలు పార్లమెంటులో కూడా ప్రైవేట్ బిల్లుకు మద్దతు తెలిపి నిబద్ధతను నిరూపించుకోవాలి. తమిళనాడు తరహాలో ఏడబ్ల్యూఎస్ స్థానిక సంస్థల్లో 42 శాతం,చట్టసభల్లో 50% రిజర్వేషన్లు అమలు చేయాల్సిన పూర్తి బాధ్యత బిజెపి దే.

ఈ విషయాన్ని విస్మరించి బిజెపి ఎంపీలు, బీసీల హక్కులను అవహేళన చేస్తే వారిని తెలంగాణలో తిరగనీయం.వారి ఇండ్లను ముట్టడిస్తాం. 42% రిజర్వేషన్ల అమలు అయ్యే వరకు బిసి మంత్రులు, బీసీ జేఏసీ పక్షాన నిలవాలి. అవసరమైతే మంత్రి పదవులకు రాజీనామా చేయాలి. ప్రజా ఉద్యమంలో పాల్గొనాలి. అదే అలా కాదని పార్టీపరమైన రిజర్వేషన్లని బీసీలకు బుకాయిస్తే ప్రభుత్వాన్ని ఎక్కడికి అక్కడ స్తంభింప చేయటానికి వెనకాడము. 42 శాతం రిజర్వేషన్లు సాధించేవరకు చేపట్టే బీసీ ఉద్యమానికి అన్ని పార్టీలలో ఉన్న బీసీ మంత్రులు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, బాధ్యత వహించి ఉద్యమానికి శక్తి మేరకు ఉపన్ దించాలి.

బిసి ప్రజల ఆకాంక్షల నెరవేరకుండా 42% రిజర్వేషన్ల అంశాన్ని పార్టీలు ప్రజాప్రతినిధులు వారి రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకుంటే ఉపేక్షించేది లేదు. ఉద్యమంలో కలసిరాని ప్రజాప్రతినిధులు బీసీలు అయిన వారికి భంగపాటు తప్పదు. చేపట్టాల్సిన బీసీ ఉద్యమాన్ని ద్వి ముఖ వ్యూహంతో ముందుకు తీసుకువెళ్తాం. ఒకపక్క రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర ప్రజలకు ఉద్యమానికి విద్యుత్తులని చేస్తూ, ప్రజా పోరాటాలు నిర్వహిస్తూ, నిరసన కార్యక్రమాలు చేపడుతూనే ఉంటాం.

మరోపక్క ఢిల్లీ కేంద్రంగా పార్లమెంటులో ప్రాతినిధ్యం ఉన్న పార్టీల మద్దతు కూడగట్టి బీసీ బిల్లు కోసం పార్లమెంట్ కేంద్రంగా ఉద్యమిస్తాం 42% రిజర్వేషన్లను చట్టపరంగా అమలు చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహిస్తే బీసీల నుండి ప్రభుత్వానికి ప్రజా ప్రతిఘటన తప్పదు. 42 శాతం రిజర్వేషన్లు సాధ్యం చేసే వరకు బిసి జేఏసీ నిష్క్రమించేది లేదు. రాష్ట్ర జిల్లా నియోజకవర్గ స్థాయి కమిటీ నిర్మాణం అడ్వకేట్, జర్నలిస్ట్, ఉద్యోగులు, కులవృత్తులు, విద్యార్థులు, జేఏసీలో, కమిటీలు గా ఉంటారు ఉద్యమ తీవ్రతను అనేక కార్యక్రమాలు మిలియన్ మార్చ్ వంటావార్పు పెన్డౌన్ జాతీయ రహదారులను ముట్టడించడం, సహాయ నిరాకరణ, రైలు రోకో మొదలగునవి చేపడతాం.

RELATED ARTICLES
- Advertisment -

Latest News