మధ్యాహ్న భోజనంతోపాటు ఉదయం అల్పాహారం
గ్రేటర్ హైదరాబాద్ (Greater Hyderabad) పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారుల పోషకాహార లోపాన్ని (Malnutrition) నివారించేందుకు ప్రభుత్వం (Government) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అంగన్‌వాడీ కేంద్రాల్లో మధ్యాహ్న భోజనం(Midday Meal)తోపాటు ఉదయం అల్పాహారం (Tiffin) అందించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ముందుగా హైదరాబాద్, రంగారెడ్డి (Rangareddy), మేడ్చల్ (Medchel) జిల్లాల పరిధిలోని మొత్తం 3,253 అంగన్‌వాడీ కేంద్రాల్లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టనున్నారు. బాలల దినోత్సవం (Childrens Day) సందర్భంగా నవంబరు 14న ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.
