Homeమహబూబ్‌నగర్‌BC | బీసీ అభ్యర్థులను అధిక మెజారిటీతో గెలిపించండి

BC | బీసీ అభ్యర్థులను అధిక మెజారిటీతో గెలిపించండి

  • పార్టీలకతీతంగా మద్దతు ప్రకటించాలి విజ్ఞప్తి.
  • డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్..

పంచాయతీ ఎన్నికల్లో పార్టీలకతీతంగా బీసీ అభ్యర్థులను గెలిపించాలని బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్ పిలు పునిచ్చారు. శనివారం ఏదుల సర్పంచ్ అభ్యర్థి ప రుశురాం యాదవ్ నామినేషన్ కార్యక్రమానికి ము ఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎర్ర గట్టు ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజ లు నిర్వహించిన అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి, భారీ ర్యాలీ నిర్వహించి నామినే షన్ వేశారు. అనంతరం రాచాల మాట్లాడుతూ.. జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలు ఎప్పటికీ పాలితులుగానే ఉండాల్సి రావడం విడ్డూరంగా ఉందన్నారు. ఓ అవకాశం బీసీలకు లభించిందని..

BC Candidates Support Rally Edu Panchayat.1

ఇప్పుడిప్పుడే సమాజంలో బీసీ వాదం పెరుగుతు న్న నేపథ్యంలో పార్టీలకతీతంగా నిస్వార్ధంగా ప్రజ ల సమస్యలను పరిష్కరించగల బీసీ అభ్యర్థుల ను గెలిపించి పంచాయతీల్లో బీసీల ప్రాధాన్యతను పెంచుకుందామని కోరారు. కాంగ్రెస్ పార్టీ కూడా బీ సీ లకు 42 శాతం ఇస్తామని ప్రకటించిందని, దానికి అనుగుణంగా బీసీ అభ్యర్థులకు మద్దతు ప్రకటిం చాలని, మిగతా పార్టీలు కూడా బీసీలకు ప్రాధా న్యం ఇవ్వాలనీ పేర్కొన్నారు. పంచాయితీ ఎన్నిక ల్లో బీసీ ల ఐక్యతను చాటి భవిష్యత్తు బిసి రాజ్యా నికి బాటలు వేయాలని సూచించారు. ఈ కార్యక్ర మంలో మాజీ సర్పంచ్ మశన్న, బీసీ పొలిటికల్ జె ఎసి మండల అధ్యక్షుడు హనుమంతు, నాయకు లు వివి గౌడ్, దేవర శివ, మహేందర్ నాయుడు, ధ ర్మేంద్ర సాగర్, రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు .

BC Candidates Support Rally Edu Panchayat.2
- Advertisement -
RELATED ARTICLES

Latest News