HomeసినిమాDevagudi | తిరుపతిలో సందడి చేసిన దేవగుడి చిత్ర యూనిట్

Devagudi | తిరుపతిలో సందడి చేసిన దేవగుడి చిత్ర యూనిట్

పుష్యమి ఫిలిం మేకర్స్ పతాకం పై బెల్లం రామకృష్ణారెడ్డి స్వీయ దర్శకత్వం లో నిర్మించిన చిత్రం దేవగుడి. ఈ చిత్రం డిసెంబర్ 19 న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సందర్భంగా చిత్ర యూనిట్ తిరుపతి , గొల్లపల్లిలోని సిద్ధార్థ ఎడ్యుకేషనల్ అకాడమీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ లో, విద్యార్థుల సమక్షంలో చిత్ర యూనిట్ సందడి చేసింది .

Devagudi Film Promotion Tirupati Event 1

ఈ కార్యక్రమంలో సిద్దార్థ ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్
ఎర్రపురెడ్డి ఆనంద్ రెడ్డి .మరియు టీ.వి.మురళీనాథ్ రెడ్డి
మరియు కళాశాల A.O స్వామినాథ్
రాయలసీమ విద్యాసంస్థల అధినేతలు
ఎర్రపురెడ్డి కొండా రెడ్డి
ఎర్రపురెడ్డి విజయ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చిత్ర యూనిట్ కళాశాల యాజమాన్యం వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
Devagudi Film Promotion Tirupati Event 2

ఈ సందర్భంగా గాయని చిత్ర ఈ సినిమాలో పాడిన పాటను సైతం కళాశాలలో ప్రదర్శించారు.. హీరో కకావాలని ఎన్నో ఏళ్ల పాటు కష్టపడ్డానని, ప్రేక్షకులందరూ తనను ఆశీర్వదించాలని హీరో అభినవ శౌర్య కోరారు. ఇంజనీరింగ్ విద్యార్థుల కేరింతల నడుమ హీరోయిన్ అను శ్రీ సినిమాలో కొన్ని డైలాగులు చెప్పింది. దర్శక, నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ డిసెంబర్ 19 విడుదల కానుందని, ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను ఆకట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సినిమా విడుదలకు రెండు రోజుల ముందు గానే తిరుపతిలో ప్రివ్యూ షో వేస్తున్నట్లు ప్రకటించారు బెల్లం రామ కృష్ణారెడ్డి.సినిమాలో ఓ పాటకు హీరో, హీరోయిన్లు స్టెప్పులు వేసి అలరించారు.

Devagudi Film Promotion Tirupati Event 3
- Advertisement -
RELATED ARTICLES

Latest News