Homeహైదరాబాద్‌Hyderabad | హైదరాబాద్‌లో ఏయూ ఎస్‌ఎఫ్‌బీ వన మహోత్సవం

Hyderabad | హైదరాబాద్‌లో ఏయూ ఎస్‌ఎఫ్‌బీ వన మహోత్సవం

ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (ఏయూ ఎస్‌ఎఫ్‌బీ) తన సీఎస్ఆర్ విభాగం ఏయూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘ఏక్ పేడ్ మా కే నామ్ 3.0’ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌లో వన మహోత్సవాన్ని నిర్వహించింది. ఘట్‌కేసర్‌లోని బాసిల్ వుడ్స్ నేచర్ స్కూల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో బ్యాంక్ ఇండిపెండెంట్ డైరెక్టర్ ఫణి శంకర్ విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు.

దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 580కు పైగా శాఖల ద్వారా 5 వేలకుపైగా మొక్కలను నాటడంతో పాటు 12 వేలకుపైగా సీడ్-పేపర్ సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించడం, సుస్థిర అభివృద్ధికి తోడ్పడటమే ఈ కార్యక్రమం లక్ష్యమని బ్యాంక్ ప్రతినిధులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News