Homeభక్తిDevelopment | శ్రీ వారాహి ప్రత్యంగిరా మాత ఉత్సవాల్లో కె.ఎల్.ఆర్.

Development | శ్రీ వారాహి ప్రత్యంగిరా మాత ఉత్సవాల్లో కె.ఎల్.ఆర్.

  • ఆర్.కె. పురం డివిజన్ లో విస్తృతంగా పర్యటన
  • కమ్యూనిటీ హాల్, టెలిఫోన్ కాలనీ పార్క్ అభివృద్ధి పనుల పరిశీలన
  • కిచ్చెన్నగారికి ఘన స్వాగతం పలికిన నగరవాసులు.

ఆషాడ మాస నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ వారాహి ప్రత్యంగిరా మాత దేవాలయంలో మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. శనివారం ఆర్కేపురం డివిజన్ లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు దేప భాస్కర్ రెడ్డి, అధ్యక్షులు పున్నా గణేష్ నేత, చిలుక ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో వారాహి, ప్రత్యంగిరా అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆలయ కమిటీ, కాంగ్రెస్ నేతలకు లక్ష్మారెడ్డి సూచించారు.

Kichannagari Laxma Reddy RK Puram Development Works

తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు అడ్డంకులు లేకుండా పేదలందరికీ అందేలా చూడాలని… మహేశ్వరం నియోజకవర్గం ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కిచ్చెన్న వేడుకున్నారు. అనంతరం రూ.50 లక్షలతో జరుగుతున్న టెలిఫోన్ కాలనీ కమ్యూనిటీ హాల్ ను పనులు, రూ.52 లక్షలతో అభివృద్ధి చేస్తున్న ఆర్కేపురం పార్క్, వాకింగ్ ట్రాక్ పనులను పరిశీలించారు కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి..

- Advertisement -

యుద్ధ ప్రతిపాదికన పనులు పూర్తి చేసి… నగర వాసులకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికార యంత్రాంగం, కాంట్రాక్టర్లకు కిచ్చెన్నగారు సూచించారు. ఈ సందర్భంగా ఆర్కేపురం, ఎన్టీఆర్ నగర్ డివిజన్ల నాయకులు, స్థానికులు పలు సమస్యలను కె.ఎల్.ఆర్. దృష్టికి తెచ్చారు. తాగునీటి సమస్య లేకుండా చూడాలని వాటర్ బోర్డు అధికారులకు లక్ష్మారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు, డివిజన్ లోని కాలనీ అధ్యక్షులు, పలు సంఘాల నేతలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News