Homeవరంగల్‌Arrive Alive | “అరైవ్ అలైవ్” కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ సత్య శారద.

Arrive Alive | “అరైవ్ అలైవ్” కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ సత్య శారద.

ప్రజాపాలన – ప్రగతి కార్యాచరణలో భాగంగా వరంగల్ ఉర్స్ రంగాలీల మైదానం కూడలి వద్ద బుధవారం నిర్వహిస్తున్న “అరైవ్ అలైవ్” రోడ్డు భద్రత కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పాల్గొన్నారు.

Arrive Alive Road Safety Program Led by Collector in Warangal

ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులతో కలిసి మానవహారం నిర్వహించి, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. సురక్షిత డ్రైవింగ్‌కు సంబంధించిన నియమాలు, జాగ్రత్తలను విద్యార్థులకు, వాహనదారులకు వివరించి, రోడ్డు ప్రమాదాల నివారణకు అందరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులతో రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో డిసిపి అంకిత్ కుమార్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఏసీపీ శుభం, పోలీసు, రవాణా, జిల్లా అధికారులు, విద్యార్థులు, వాహనదారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News