- రూ. 51 చెల్లిస్తే అపరిమిత కాల్స్..BSNL Rs. 51 Offer
- ఉచితంగా సిమ్ కార్డు..
ప్రైవేట్ టెలికాం సంస్థల రీఛార్జ్ ధరల మోతతో బెంబేలెత్తుతున్న సామాన్యులకు ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ శుభవార్త అందించింది. కొత్త కస్టమర్లను ఆకర్షించడమే లక్ష్యంగా కళ్లుచెదిరే పరిమిత కాల ఆఫర్‌ను తెరపైకి తెచ్చింది. (BSNL Rs. 51 Offer) కేవలం రూ. 51కే ఉచిత సిమ్ కార్డుతో పాటు దాదాపు నెల రోజుల పాటు భారీ డేటా, అపరిమిత కాలింగ్ ప్రయోజనాలు కల్పిస్తూ కొత్త ప్రీపెయిడ్ ప్యాకేజీని మార్కెట్లోకి తీసుకొచ్చింది. ప్రైవేట్ నెట్‌వర్క్‌ల నుంచి బీఎస్ఎన్ఎల్ కనెక్షన్ మారాలనుకునే వారికి, తక్కువ ఖర్చుతో సెకండరీ సిమ్ వాడేవారికి ఇది అద్భుతమైన అవకాశంగా మారింది.
ఈ స్పెషల్ ఆఫర్ కింద యూజర్లకు లభించే ప్రయోజనాలు సాధారణంగా రూ.300 పైబడిన ప్లాన్లకు సరితూగేలా ఉన్నాయి. పూర్తి ప్యాకేజీ ధర కేవలం రూ. 51 మాత్రమే. దీనితో పాటే ఉచిత సిమ్ కార్డు లభిస్తుంది. రోజుకు 2జీబీ చొప్పున హైస్పీడ్ డేటా అందుతుంది. వ్యాలిడిటీ కాలంలో మొత్తం 56జీబీ డేటా లభిస్తుంది. లోకల్, ఎస్టీడీ, రోమింగ్ నెట్‌వర్క్‌లకు ఎలాంటి పరిమితి లేకుండా అపరిమిత ఉచిత కాల్స్ మాట్లాడుకోవచ్చు. రోజువారీ అవసరాల కోసం రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. సిమ్ యాక్టివేషన్ అయిన నాటి నుంచి 28 రోజుల పాటు ఈ సేవలన్నీ పూర్తి ఉచితంగా అందుబాటులో ఉంటాయి.
ఈ ఆఫర్ పూర్తిగా కొత్త కనెక్షన్ తీసుకునే వారికి మాత్రమే వర్తిస్తుంది. ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్‌లో ఉన్న పాత ప్రీపెయిడ్ లేదా పోస్ట్‌పెయిడ్ యూజర్లు ఈ రీఛార్జ్‌ను పొందలేరు. కొత్త సిమ్ తీసుకోవాలనుకునే వారు సమీపంలోని బీఎస్ఎన్ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్ (సీఎస్‌సీ)ను, లేదా, గుర్తింపు పొందిన రిటైలర్లను సంప్రదించవచ్చు. బీఎస్ఎన్ఎల్ సెల్ఫ్‌కేర్ యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. కేవైసీ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసుకున్న తర్వాత ఈ రూ.51 మొదటి రీఛార్జ్ అమలవుతుంది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
