- కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడిగా, వార్డ్ మెంబర్ గా బాధ్యత నిర్వహణ
ఒకప్పటి యువతరానికి,ప్రస్తుత తరానికి,సమాజ సేవకుడిగా అందరికీ సుపరిచితులు మోత్కూర్ మున్సిపల్ కేంద్రానికి చెందిన మండల కాంగ్రెస్ నాయకులు ఎడ్ల శ్రీనివాస్. ఆయన గతంలో మోత్కూర్ వార్డ్ మెంబర్ గాను,కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులుగాను బాధ్యతలు నిర్వహించారు. ఆయన కాంగ్రెస్ పార్టీకి 30 ఏళ్లుగా సేవలందిస్తున్నారు.ఆయన కొన్ని కారణాలతో రాజకీయానికి కొంతకాలం దూరంగా ఉన్న ఆయన మనసు మాత్రం సమాజం పైన, మోత్కురు రాజకీయాల పైనే ఉంటుంది.
సమాజం పైన అవగాహన లేని అందరు రాజకీయంలోకి వస్తున్నారని, పదవులను పొందుతున్నారని, తాను మాత్రం ఇంతకు ముందుల అన్ని వర్గాలకు దగ్గరగా ఉండి సమాజంలోకి రావాలని రేపు మోత్కూరు మున్సిపాలిటీలో జరగబోయే మున్సిపల్ కో-ఆప్షన్ (నామినేటెడ్) పదవుల ఎన్నికల్లో తనకు కో ఆప్షన్ పదవి ఇవ్వాలని పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తున్నారు.ఎన్ ఎస్ యూ ఐ, యూత్ కాంగ్రెస్ లో అనేక పదవులు పొందరన్నారు..
1996లో గాంధీ పబ్లిక్ సిటీ వింగ్ లో వలిగొండ మండలం నాగారంలో జిల్లా ట్రైనర్ల శిక్షణా శిబిరంలో పాల్గొని, ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ పార్టీకి కట్టుబడి ఉన్న తాను సామాజిక సేవా కార్యక్రమాల్లో సైతం కొనసాగుతున్నానని,ఎమ్మెల్యే,ఎంపీ,జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు తనను మున్సిపల్ కో-ఆప్షన్ పదవికి ఎంపిక చేయాలని కోరుతున్న అన్నారు.
