Homeభక్తిKartika Purnima Deepadana | విశిష్టమైన కార్తీక మాసం..

Kartika Purnima Deepadana | విశిష్టమైన కార్తీక మాసం..

  • హరి హరులకు అత్యంత ప్రీతికరమైన మాసం..Kartika Purnima Deepadana
  • దానధర్మాలతో బాటు దీపదానం చేయడం విశేషం..

హిందూ ధర్మంలో కార్తీక మాసానికి ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. ఈ మాసం విష్ణుమూర్తికి, పరమశివుడికి అత్యంత ప్రీతికరమైనదిగా భక్తులు భావిస్తారు. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి (Kartika Purnima Deepadana) రోజుకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. ఈ పవిత్రమైన రోజున పుణ్యస్నానాలు, పూజలు, ఉపవాసాలు, దానధర్మాలతో పాటు దీపదానం చేయడం అత్యంత విశేషంగా భావిస్తారు. నదీ తీరాల్లో, ఆలయాల్లో, తులసి కోట దగ్గర దీపాలు వెలిగించి భగవంతుడికి సమర్పిస్తారు. ఇలా దీపదానం చేయడం వల్ల పుణ్యఫలం లభిస్తుందని, ఇంట్లో సుఖశాంతులు, సంతోషం నెలకొంటాయని భక్తుల విశ్వాసం.

దీపదానం అంటే ఏమిటి?.. దీపదానం అంటే భగవంతుడికి దీపాన్ని సమర్పించడం. ‘దీపం’ అంటే వెలుగు, ‘దానం’ అంటే సమర్పించడం. అంటే భగవంతుడికి వెలుగును సమర్పిస్తూ భక్తిని చాటుకోవడమే దీపదానం. కార్తీక మాసంలో ప్రతిరోజూ దీపం వెలిగించడం విశేషమైన పుణ్యకార్యంగా భావిస్తారు. ఇక కార్తీక పౌర్ణమి రోజున నదులు, చెరువుల తీరాలు, ఆలయాలు, తులసి మొక్క దగ్గర దీపాలు వెలిగిస్తారు. ముఖ్యంగా గంగా నది ఘాట్ల వద్ద వేలాది దీపాలను వెలిగించి భక్తులు దీపదానం చేస్తారు. కార్తీక పౌర్ణమి రోజు దీపదానం ఎలా చేయాలి?.. ఈ పవిత్రమైన రోజున ఇంట్లోనే భక్తిశ్రద్ధలతో దీపదానం చేసుకోవచ్చు.Kartika Purnima Deepadana

- Advertisement -

ముందుగా ఇంటిని, పూజగదిని శుభ్రం చేసుకోవాలి. తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. మట్టి ప్రమిదలను తీసుకుని వాటిలో నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి వత్తులు వేయాలి. పూజా మందిరంలో విష్ణుమూర్తి, పరమశివుడు, లక్ష్మీదేవికి పూలు, ధూపదీపాలతో పూజ చేయాలి. అనంతరం ఇంటి ప్రధాన ద్వారం, పూజగది, తులసి కోట దగ్గర దీపాలను వెలిగించాలి. వీలైతే సమీపంలోని ఆలయానికి వెళ్లి దీపదానం చేయాలి. నదీ తీరాల్లో దీపాలు సమర్పించేటప్పుడు స్థానిక సంప్రదాయాలను పాటించాలి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం, సుఖసంతోషాలు, శ్రేయస్సు కోసం భగవంతుడిని ప్రార్థించాలి. ఈ రోజున పేదలకు అన్నదానం, వస్త్రదానం లేదా ఇతర అవసరమైన వస్తువులను దానం చేయడం మంచిదిగా భావిస్తారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News