HomeజాతీయంRailway | రైలు ప్రయాణికులకు లక్సరీ రెస్ట్ సౌకర్యం..

Railway | రైలు ప్రయాణికులకు లక్సరీ రెస్ట్ సౌకర్యం..

  • గంటకి కేవలం రూ. 99 మాత్రమే ఛార్జి..Railway
  • అలువా, ఎర్నాకులం జంక్షన్ లో ఏర్పాటు..

రైలు ప్రయాణికులకు తక్కువ ధరలోనే విలాసవంతమైన విశ్రాంతి సౌకర్యాన్ని అందించేందుకు దక్షిణ (Railway) రైల్వే సరికొత్త ప్రణాళికను సిద్ధం చేసింది. కేరళంలోని రెండు కీలక రైల్వే స్టేషన్లలో గంటకు కేవలం రూ.99 ప్రారంభ ధరతో ఎయిర్ కండిషన్డ్ స్లీపింగ్ పాడ్స్ (ప్రైవేట్ క్యాబిన్లు) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కనెక్టింగ్ రైళ్ల కోసం ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వచ్చే ప్రయాణికులు, లేదా వేళగాని వేళల్లో స్టేషన్‌కు చేరుకునేవారు హోటల్ గదులపై వేలకు వేలు ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా వీటిని తీసుకువస్తున్నారు.

ఈ సరికొత్త సదుపాయాన్ని తిరువనంతపురం డివిజన్ పరిధిలోని అలువా, ఎర్నాకుళం జంక్షన్ స్టేషన్లలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ డివిజన్‌లో ఇలాంటి అత్యాధునిక పాడ్ సౌకర్యాలు అందుబాటులోకి రావడం ఇదే తొలిసారి. అలువా స్టేషన్ సమీపంలోని కేఎస్‌ఆర్‌టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న రైల్వే స్థలంలో రెండు అంతస్తుల్లో, దాదాపు 10,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఎగ్జిక్యూటివ్ లాంజ్‌ను నిర్మించనున్నారు. ఇందుకోసం దక్షిణ రైల్వే ఇప్పటికే టెండర్లు ఆహ్వానించింది. ఈ ప్రాజెక్టును పదేళ్ల లీజు ప్రాతిపదికన ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తారు. ఎర్నాకుళం జంక్షన్‌లో మెయిన్ ప్లాట్‌ఫామ్ ఉత్తరం వైపున ప్రస్తుతం ఉన్న ఏసీ వెయిటింగ్ హాల్ పైభాగంలో ఈ లాంజ్ రానుంది.

- Advertisement -

ఈ ప్రైవేట్ స్లీపింగ్ పాడ్స్‌లో ప్రయాణికులకు అత్యాధునిక వసతులు కల్పించనున్నారు. వీటిలో సుఖంగా పడుకునేందుకు అనువైన రిక్లైనింగ్ బెడ్స్, పర్సనల్ క్లైమేట్ కంట్రోల్ (ఏసీ ఉష్ణోగ్రత సర్దుబాటు), పూర్తి గోప్యత కోసం ప్రైవసీ డోర్లు లేదా లాకింగ్ వ్యవస్థ ఉంటాయి. దీంతో పాటు యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్టులు, రీడింగ్ లైట్లు, హైస్పీడ్ వైఫై ఇంటర్నెట్ సౌకర్యాన్ని సమకూరుస్తారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News