- స్వాగతం పలికిన జీ జిన్ పింగ్..Donald Trump China Visit
- రెడ్ కార్పెట్ పరిచి ఆహ్వానం..
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం ఆసియా పర్యటనలో ఉన్నారు (Donald Trump China Visit). ఇవాళ ఆయన చైనాలోని షెంజెన్ చేరుకున్నారు. అక్కడ దేశాధ్యక్షుడు జీ జిన్‌పింగ్.. ట్రంప్‌కు స్వాగతం పలికారు. విమానం దిగిన తర్వాత ట్రంప్‌ను జిన్‌పింగ్ హత్తుకున్నారు. ట్రంప్ రాక సందర్భంగా రెడ్‌కార్పెట్ పరిచారు. ఇదే సంవత్సరం జిన్ పింగ్ అమెరికాలో టూర్ చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో వాషింగ్టన్‌లో విమానాశ్రయానికి వెళ్లి ట్రంప్ స్వాగతం పలికారు. అయితే ఎపెక్ సమావేశాల్లో పాల్గొనేందుకు ట్రంప్ షెంజెన్ చేరుకున్నారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో కలిసి రేపు ముగ్గురు సమావేశంకానున్నారు. జపాన్ ప్రధాని సనేయి టకాయిచి కూడా షెంజెన్ చేరుకున్నారు. తొలిసారి ఆమె చైనాలో పర్యటిస్తున్నారు. తైవాన్ అంశంలో ఈ రెండు దేశాల మధ్య ఇటీవల మాటల యుద్ధం సాగింది. మరో వైపు అమెరికాకు చెందిన ఎన్విడియా కంపెనీ తన ఏఐ చిప్స్ సరఫరాను చైనాకు నిలిపివేసింది. చైనా మహిళతో రిలేషన్‌లో ఉన్నట్లు చెప్పిన ఎన్విడియా సీఈవో జేన్సన్ హువాంగ్ కొన్ని రోజుల క్రితం ఆ కంపెనీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అలిస్ హువాంగ్ వ్యాపారి కాదు అని, ఆమెకు చైనా ఇంటెలిజెన్స్‌తో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి. అయితే చిప్స్ తయారీలో నెంబర్ వన్ అయిన ఎన్విడియా.. తన కంపెనీ ఉత్పత్తులను చైనాకు అమ్మరాదు అని నిర్ణయించింది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
