- ప్రశంసించిన ఆస్ట్రేలియా ప్రధాని..
- మెల్బోర్న్ మీట్స్ మోడీ కార్యక్రమంలో ఆంథోనీ ఆల్బనీస్..
ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ మరోసారి ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు. మోదీ ఆస్ట్రేలియాకు నిజమైన మిత్రుడని, తనకు ఎంతో ఆప్తుడని అన్నారు. మెల్బోర్న్లో జరిగిన ‘మెల్బోర్న్ మీట్స్ మోదీ’ కార్యక్రమంలో భారతీయులను ఉద్దేశించి మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
మెల్బోర్న్లోని మార్వెల్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో భారతీయులు హాజరయ్యారు. ఎన్నో చారిత్రక కార్యక్రమాలకు ఈ స్టేడియం వేదికగా నిలిచిందని, కానీ భారతీయుల ఈ సమావేశం అత్యంత ప్రత్యేకమైందని ఆల్బనీస్ అన్నారు. ఈ సభలో కనిపిస్తున్న ఉత్సాహమే భారత్, ఆస్ట్రేలియా మధ్య ఉన్న బలమైన బంధానికి నిదర్శనమని పేర్కొన్నారు.
ప్రధానిగా తాను రెండుసార్లు భారత్‌లో పర్యటించే అవకాశం దక్కిందని ఆల్బనీస్ గుర్తు చేసుకున్నారు. భారతదేశ అందాలు, ప్రజల ఆతిథ్యం తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని చెప్పారు. 2023లో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మోదీతో కలిసి రథంలో ప్రయాణించిన అనుభవాన్ని ఎప్పటికీ మరిచిపోలేనని అన్నారు. అప్పట్లో గుజరాత్లో చూసిన ఆప్యాయత, ఇప్పుడు ఈ సభలోనూ కనిపిస్తోందని వ్యాఖ్యానించారు.
