బ్లాక్‌బస్టర్ సక్సెస్ ‘కోర్ట్ – స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’ తర్వాత న్యాచురల్ స్టార్ నాని యునానిమస్ ప్రొడక్షన్స్ మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్తో రాబోతోంది. ‘అలియాస్ రుక్మిణి’ (Alias Rukmini) అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నితిన్ హీరోగా నటిస్తుండగా, ‘దండోరా’ ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వం వహిస్తున్నారు. దీప్తి గంటా నిర్మిస్తున్న ‘అలియాస్ రుక్మిణి’ ఒక విలక్షణమైన కథనంతో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రాన్ని పూర్తి చేయడానికి కేవలం ఒక షెడ్యూల్ మాత్రమే మిగిలి ఉంది.
శరవేగంగా షూటింగ్ జరుగుతుండటంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఏకకాలంలో కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మేకర్స్ సినిమా ప్రపంచవ్యాప్త థియేట్రికల్ రిలీజ్‌కు డిసెంబర్ 4వ తేదీని ఖరారు చేశారు. రిలీజ్ డేట్ పోస్టర్లో నితిన్ ఒక సాధారణ మధ్యతరగతి వ్యక్తిగా కనిపిస్తున్నారు. చెక్స్ షర్ట్, ఫార్మల్ ట్రౌజర్స్, కళ్లద్దాలు ధరించి, భుజానికి బ్యాగ్ తగిలించుకుని కోర్టు ప్రాంగణంలో జనాల మధ్య నిలబడి ఉన్నారు. వెనుకవైపు న్యాయవాదులు, పోలీసులు కనిపిస్తున్నారు. ఆయన ముఖంలోని ప్రశాంతతతో పాటు ఏదో కొత్త పరిస్థితిని ఎదుర్కొంటున్న వ్యక్తిలా కనిపించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరోవైపు హీరోయిన్ సిల్హౌట్ కథలోని మిస్టరీని మరింత పెంచుతోంది.
కృష్ణ అనే కథానాయకుడు సాధారణమైన, ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతుంటాడు. అయితే కొన్ని నిజాలను బయటపెట్టకుండా ఉండటమే మంచిదనే పరిస్థితులు ఎదురవుతుంటాయి. అలాంటి సమయంలో అతడి జీవితంలోకి ప్రేమ ప్రవేశిస్తుంది. అనుకోకుండా బయటపడిన ఓ రహస్యం అతను నమ్మిన ప్రతిదాన్నీ తలకిందులు చేసే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రేమ, దాగి ఉన్న నిజాల చుట్టూ సాగే ఈ కథ.. సమాజం అంగీకరించే విషయాలకు, ప్రశ్నించాలనుకునే అంశాలకు మధ్య ఉన్న సన్నని గీతను ఆవిష్కరించనుంది.
విభిన్నమైన కాన్సెప్ట్‌తో పాటు ప్రతిభావంతులైన నటీనటులు, సాంకేతిక నిపుణులు కలవడంతో ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.సినిమా అనౌన్స్మెంట్ గ్లింప్స్‌లో చూపించిన క్విర్కీ హ్యూమర్‌కు మంచి స్పందన లభించింది. దీంతో సినిమాపై పాజిటివ్ బజ్ మరింత పెరిగింది.సినిమా ప్రమోషన్స్‌ను వేగవంతం చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. త్వరలోనే తొలి పాటను విడుదల చేసి మ్యూజికల్ ప్రమోషన్స్‌ను ప్రారంభించనున్నారు. ఈ చిత్రానికి జోమోన్ టీ. జాన్ ISC సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. విజయ్ బుల్గానిన్ సంగీతం సమకూరుస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తుండగా, సృజన అడుసుమిల్లి ఎడిటింగ్. (https://epaper.aadabhyderabad.in/)(Youtube)
తారాగణం: నితిన్, సాయి కుమార్, హర్ష వర్ధన్
సాంకేతిక సిబ్బంది:
సమర్పణ: నేచురల్ స్టార్ నాని
ప్రొడక్షన్ బ్యానర్: యూనానిమస్ ప్రొడక్షన్స్
రచన, దర్శకత్వం: మురళీ కాంత్ దేవసోత్
నిర్మాత: దీప్తి గంటా
సినిమాటోగ్రఫీ: జోమోన్ T. జాన్ ISC
సంగీతం: విజయ్ బుల్గానిన్
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
ఎడిటర్: సృజన అడుసుమిల్లి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ప్రశాంత్ మండవ
కాస్ట్యూమ్ డిజైనర్: రేఖ బొగ్గర్రపు
పబ్లిసిటీ డిజైనర్: భరణిధరన్
మార్కెటింగ్: ఫస్ట్ షో
PRO: వంశీ-శేఖర్
