Homeహైదరాబాద్‌Conference | ఓయూలో ముగిసిన AIU సెంట్రల్ జోన్ వీసీల సదస్సు

Conference | ఓయూలో ముగిసిన AIU సెంట్రల్ జోన్ వీసీల సదస్సు

  • ఏఐ–క్వాంటం రోడ్‌మ్యాప్‌పై కీలక చర్చలు

సికింద్రాబాద్,పిబ్రవరి 20 అసోసియేషన్ అఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా జరిగిన సెంట్రల్ జోన్ ఉపకులపతుల రెండు రోజుల సదస్సు విజయవంతంగా ముగిసింది.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మరియు క్వాంటం సాంకేతికతతో కూడిన ఉన్నత విద్యా సంస్థల నిర్మాణం.అనే ఇతివృత్తంతో జరిగిన ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల నుంచి సుమారు 120 మంది ఉపకులపతులు,విద్యావేత్తలు పాల్గొన్నారు.

ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ హాజరై,ఆధునిక సాంకేతికతకు అనుగుణంగా విద్యావ్యవస్థ రూపాంతరం చెందాల్సిన అవసరాన్ని వివరించారు.విద్యార్థులు ఉద్యోగ అన్వేషకులుగా కాకుండా ఉద్యోగ సృష్టికర్తలుగా ఎదగాలని సూచించారు.ఓయూ ఉపకులపతి ఆచార్య కుమార్ మొలుగరం మాట్లాడుతూ ఏఐ మౌలిక సదుపాయాలు,క్వాంటం పరిశోధన సన్నద్ధత,విశ్వవిద్యాలయాల మధ్య సమన్వయంపై జరిగిన సాంకేతిక సెషన్ల సారాంశాన్ని వెల్లడించారు.

- Advertisement -
AIU VC Conference Concludes at Osmania University

భవిష్యత్తులో పరస్పర భాగస్వామ్యంతో పరిశోధనలకు ఈ సదస్సు దోహదపడుతుందని తెలిపారు.AIU సెక్రటరీ జనరల్ డాక్టర్ పంకజ్ మిట్టల్ ఏర్పాట్లను అభినందించగా, ఇంటర్నేషనల్ ఇనిట్యూట్ అఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ,హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ సందీప్ శుక్లా అధ్యక్షతన జరిగిన సాంకేతిక సదస్సులో నైతిక ఏఐ,గ్లోబల్ నియంత్రణ ప్రమాణాలపై చర్చించారు.ఈ సదస్సు ఉన్నత విద్యలో నైతిక ఏఐ,క్వాంటం ఆవిష్కరణలు మరియు దూరదృష్టి నాయకత్వంతో జాతీయ విద్యా పునర్నిర్మాణానికి మార్గదర్శకంగా నిలిచిందన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News