- పోలియో కేంద్రాలను పరిశీలించిన సర్పంచ్ మందుగుల విజయ శ్రీశైలం గౌడ్..
- చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన సర్పంచ్..
అబ్దుల్లాపూర్‌మెట్ మండల కేంద్రంలోని పల్స్ పోలియో కేంద్రాలను ఆదివారం సర్పంచ్ మందుగుల విజయ శ్రీశైలం గౌడ్ సందర్శించి, చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. మండల కేంద్రంలో రామోజీ ఫిలిం సిటీ టికెట్ కౌంటర్ పక్కన, గవర్నమెంట్ హాస్పిటల్ బీసీ కాలనీ, అంగన్వాడి కేంద్రంలో, జే.ఎన్.ఎన్.యు.ఆర్.ఎం. కాలనీ, వివిధ ప్రాంతాలలో పోలియో కేంద్రాలు ఏర్పాటు చేశారు.


ఈ సందర్భంగా సర్పంచ్ విజయ మాట్లాడుతూ.. 5 సంవత్సరాల లోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు. తద్వారా పోలియోను అంతమొందించి పోలియో రహిత దేశాన్ని నిర్మిద్దామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అంతటి సుష్మా అశోక్ గౌడ్, పాలకవర్గ సభ్యులు, మాచకోని మహేందర్ ముదిరాజ్, బత్తిని దీపిక నాగరాజు, దశరథ గౌడ్, అంగన్వాడీ ఉపాధ్యాయులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, వైద్యులు పాల్గొన్నారు.
