- ఆహ్వానపత్రిక అందించిన ఆదాబ్ సీఎండీ సత్యం వీరమళ్ళ..
నమ్ముకున్న జర్నలిజం విలువలను సంరక్షిస్తూ 14 సంవత్సరాల సుదీర్ఘ అక్షర పోరాటం సాగిస్తూ సాగిపోతున్న ఆదాబ్ హైదరాబాద్ తెలుగు దిన పత్రిక 15వ సంవత్సరంలోకి విజయవంతంగా అడుగుపెట్టింది. ఈ సందర్భంగా 15వ వార్షికోత్స వ వేడుకలను ఘనంగా జరుపుకుంటోంది. ఈనెల 26, బుధవారం నాడు రవీంద్రభారతిలో ఉత్స వాలను జరుపుకుంటోంది. ఈ సందర్భంగా తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి వేడుకలకు హాజరుకావాలని కోరుతూ ఆహ్వానపత్రిక అందించారు ఆదాబ్ సీఎండీ సత్యం వీర మళ్ళ.. ఆహ్వానపత్రిక అందుకున్న భట్టి తప్పకుండా హాజరవుతానని తెలుపుతూ ఆదాబ్ యాజమా న్యానికి,సిబ్బందికి శుభాభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆదాబ్ ప్రతినిథులు పాల్గొన్నారు.
- Advertisement -
