- కరెంట్ కష్టాలతో కుదేలవుతున్న రైతులు, సామాన్యులు..
- సీఎం రేవంత్ సొంత నియోజకవర్గంలో రోడ్డెక్కిన రైతులు..
- కాంగ్రెస్ వస్తే కరెంటు పోతుంది అన్న విపక్షాల మాటలు నిజం కాబోతున్నాయా..?
- అధికారంలోకి రాకముందు రేవంత్ చెప్పిన మాటలు ఎక్కడికి వెళ్లాయి
- అప్పటి అధికార బీ.ఆర్.ఎస్.పై ఆయన చేసిన విమర్శలు ఏమైయ్యాయి..
- ప్రస్తుత విద్యుత్ కోతలపై ప్రజలకు ఆయనిచ్చే సమాధానం ఏమిటి..?
- అన్ని వర్గాల ప్రజలు అతలాకుతలం అవుతుంటే ఎందుకు పట్టించుకోవడం లేదు..
- సమస్య మూలాలు ఎక్కడున్నాయో తెలుసుకుని పరిష్కారం చూపండి..
- రైతులు, సామాన్యులు, అన్నివర్గాల జీవితాల్లో వెలుగులు నింపండి..
- తెలంగాణ సీఎం ను హెచ్చరిస్తున్న రాజకీయ విశ్లేషకులు..
ఎల్ నీనో దెబ్బతో అల్లాడిపోతున్న అన్నదాతలకు, కరెంట్ కోతల రూపంలో(Telangana Power Crisis) మరో ముప్పు ముంచుకొచ్చింది. బోర్ల మీద ఆధారపడి సాగు చేస్తున్న రైతుల కన్నీళ్లను చూస్తూ ఉంటే కడుపు తరుక్కుపోతోంది.. నాటి బీఆరఎస్ హయాంలో కొంతమేర పచ్చగా కళకళలాడిన పొలాలు, నేడు పవర్ కట్లతో ఎండిపోతుండటం ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ప్రభుత్వాల వైఫల్యాలు, బకాయిల లొసుగులు సామాన్యుడికి అనవసరం.. తమ పొలాలు తడవడానికి, గృహాలు వెలుతురులో ఉండటానికి నాణ్యమైన కరెంట్ ఉందా లేదా అనేదే వారి ఏకైక ప్రశ్న. ఈ నిర్లక్ష్య ధోరణి ఇలాగే కొనసాగితే, కేవలం పంటలే కాదు.. యావత్ తెలంగాణ భవిష్యత్తు కూడా అంధకారంలో చిక్కుతుందనే భయం వెంటాడుతోంది.

కరెంటు కష్టాలు.. రోజుకి కేవలం 6 నుంచి 8 గంటలు మాత్రమే కరెంట్.. పొలాలు ఎండిపోతున్నాయి.. రైతుల జీవితాలు మండిపోతున్నాయి.. సాక్షాత్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సొంత నియోజకవర్గం లోనే విపరీతమైన కరెంట్ కోతలు(Telangana Power Crisis) విధిస్తున్నారు.. అక్కడి రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేయడం చూశాం.. రేవంత్ రెడ్డి సొంత ప్రాంతంలోనే ఈ పరిస్థితి నెలకొని ఉంటే.. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉంటాయో ఊహించలేము.. ఎండాకాలం కాకుండానే ఈ దుర్భర పరిస్థితులు ఉంటే.. భవిష్యత్తులో ఎంతటి భయానక దృశ్యాలు చూడాల్సి వస్తుందో ఊహించుకుంటేనే భయం వేస్తోంది..
అసలే ఎల్ నీనో తో రైతులు నానా ఇబ్బందులు పడుతుంటే.. బోర్లను నమ్ముకుని వ్యవసాయం చేస్తున్న రైతులు ఇలా కరెంట్ కోతలతో నానా అగచాట్లు పడుతున్నారు.. గడచిన పదేళ్లలో ఎలాంటి కోతలు ఉండేవి కాదు.. కరెంట్ కొనుకున్నారా..? విద్యుత్ సంస్థలకు బకాయిలు పడ్డారా..? ఇవన్నీ రైతులకు, సామాన్యులకు అవసరం లేదు.. తమ అవసరాలకు కరెంట్ ఉందా..? లేదా అని మాత్రమే ఆలోచిస్తారు.. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం యావత్తు చీకటిలో మునిగిపోయే పరిస్థితులు తలెత్తబోతాయా..? అన్న భాయాందోళనలు సర్వత్రా నెలకొని ఉన్నాయి..

గురువారం రోజు నాగర్కర్నూల్ జిల్లా, కొండారెడ్డిపల్లిలో శ్రీశైలం – హైదరాబాద్ జాతీయ రహదారిపై రైతులు చేపట్టిన మెరుపు ధర్నా రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమైంది. ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించే సొంత నియోజక వర్గం, అందునా ఆయన స్వగ్రామంలోనే విద్యుత్ సరఫరా కుప్ప కూలడం పాలకుల వైఫల్యానికి అద్దం పడుతోంది. ఈ పరిస్థి తులు దేనికి దారితీయబోతున్నాయి.. గతంలో రేవంత్ ప్రతి పక్షంలో ఉన్నప్పుడు అప్పటి ప్రభుత్వం మీద సంచలన విమ ర్శలు చేశారు.. కరెంట్ కొనుగోళ్లపై ఎన్నో నిరసనలు చేశారు..అయితే ఇప్పడు రాష్ట్రాన్ని మీరు పాలిస్తున్నారు..
మరిప్పుడు మీరేం చేస్తున్నారు..? నిర్విరామంగా కరెంట్ ఎందుకు సరఫరా చేయలేకపోతున్నారు అని విశ్లేషకులు సూటిగా ప్రశ్నిస్తున్నారు.. మరి దీనికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏమని సమాధానం చెబుతుంది.? అల్లాడిపోతున్న రైతులకు ఎలా ముఖం చూపించబోతోంది..? ఒక్క రైతులే కాదు, విద్యార్థులు, ఉద్యోగులు, అలాగే పరిశ్రమలు కరెంట్ కష్టాల్లో కూరుకునిపో తున్నాయి.. భవిష్యత్తులో ఏమి చేయాలో అర్ధం కాక తలపట్టుకుంటున్నారు..
దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని జాగ్రత్త పడకపోతే.. ఈరోజు కొండారెడ్డి పల్లి, రేపు రాష్ట్రంలోని రైతులు, మిగతా వర్గాలవారు రోడ్డెక్కితే పరిస్థితి ఏమిటి..? తిండి కోసం పోరాడాలా..? బ్రతుబండి నడవడం కోసం పోరాడాలా..? లేక కరెంట్ కోసం పోరాడాలా..? ఇక జీవితమంతా పోరాటాలు చేస్తూనే గడపాలా..? తాము ఓట్లేసి గెలిపించిన నాయకులు ఏసీ రూముల్లో సేద తీరుతుంటే నిరసనలతో తాము స్వేదం చిందిస్తూ చస్తూ బ్రతకాలా..? అని సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ సామాన్యులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. మరి సీఎం రేవంత్ గారు ఏమని సమాధాన చెబుతారు..? ఈ సమస్యను ఎలా నెట్టుకువస్తారు..? అన్నది ఆసక్తికరంగా మారిందని చెప్పవచ్చు..(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
