మారుతీ సుజుకీ సరికొత్త మైలురాయి(Milestone)ని అందుకుంది. మన దేశంలో 3 కోట్ల కార్లను విక్రయించింది. మొదటి కోటి కార్లను అమ్మటానికి ఆ కంపెనీకి ఏకంగా 28 ఏళ్లకు పైగా సమయం పట్టగా రెండో కోటి కార్లను ఏడున్నరేళ్లలోనే సేల్ చేయగలిగింది. మూడో కోటి కార్లను మరింత తక్కువ సమయంలో (ఆరేళ్ల నాలుగు నెలల్లో) విక్రయించింది.

ప్రస్తుతం 19 మోడళ్లు(Models), 170 వేరియెంట్ల(Variants)లో కార్లు అందుబాటులో ఉండగా అత్యధికంగా (47 లక్షల) ఆల్టో (Alto) అనే ఎంట్రీ లెవల్ మోడల్ కార్లను అమ్మింది. ఆ తర్వాత స్థానాల్లో.. 34 లక్షల వ్యాగనార్(WagonR) కార్లు సేల్ అయ్యాయి. దీని తర్వాత స్విఫ్ట్ (Swift) కార్లు 32 లక్షలు విక్రయం జరిగాయి. ఈ సంస్థ 1983లో డిసెంబర్ 14న మారుతీ 800(Maruti 800)తో ప్రయాణం ప్రారంభించింది.

