HomeతెలంగాణKarregutta Tourism Ban | కర్రెగుట్టలో పర్యాటకులకు అనుమతి లేదు..

Karregutta Tourism Ban | కర్రెగుట్టలో పర్యాటకులకు అనుమతి లేదు..

  • ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది..Karregutta Tourism Ban
  • వెల్లడించిన డీజీపీ ఆనంద్, ఐపీఎస్..

కర్రెగుట్ట అటవీప్రాంతంలోకి పర్యాటకులను అనుమతిస్తే తీవ్ర ప్రమాదాలు జరిగే అవకాశముందని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌ స్పష్టం చేశారు (Karregutta Tourism Ban). హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాస ప్యాకేజీ అందజేసే కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కర్రెగుట్ట ప్రాంతాన్ని ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నప్పటికీ, భద్రతా కారణాల దృష్ట్యా ప్రస్తుతానికి అక్కడికి పర్యాటకుల రాకను అనుమతించబోమని తేల్చిచెప్పారు.

ఆ ప్రాంతంలో మావోయిస్టులు పెద్ద సంఖ్యలో వివిధ రకాల మైన్లు (మందుపాతరలు) అమర్చారని డీజీపీ వివరించారు. ముఖ్యంగా ప్రెషర్‌ మైన్స్‌ ఎక్కువగా ఉన్నట్లు అనుమానాలు ఉన్నాయని, అవి ఎక్కడెక్కడ ఉన్నాయనే దానిపై స్పష్టమైన సమాచారం లేదన్నారు. కొంతమంది మావోయిస్టులను విచారించడంతో 9 డంప్‌లను గుర్తించాం అని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

ఈ 9 డంప్‌ల నుంచి 252 తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని డీజీపీ తెలిపారు. ఆ ప్రాంతంలో ఉన్న మైన్లను పూర్తిగా తొలగించి, క్లియరెన్స్ వచ్చిన తర్వాతే పర్యాటకులను అనుమతిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా హింసామార్గాన్ని వీడి ప్రధాన స్రవంతిలోకి వచ్చిన 214 మంది మావోయిస్టులకు మొత్తం రూ.5.59 కోట్ల నగదు రివార్డులు, పునరావాస సాయాన్ని అందజేశారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని, ప్రశాంత జీవనం గడిపేలా అన్ని విధాలా సహకరిస్తుందని డీజీపీ పేర్కొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News