- గుర్తుచేసుకున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి..Uttam Kumar Reddy
- పార్టీ కష్టకాలంలో ఏడేళ్లు పీసీసీగా చేశానని వెల్లడి..
హైదరాబాద్‌లోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీ భవన్‌తో తనకు ఎంతో అనుబంధం ఉందని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు (Uttam Kumar Reddy ). గాంధీ భవన్లో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నూతన ఇన్ఛార్జ్ బీఎం సందీప్‌తో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు భేటీ అయ్యారు. పార్టీ అంతర్గత వ్యవహారాలతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై వీరు చర్చించారు.
ఈ భేటీ అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో తాను ఏడేళ్ల పాటు పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. “గాంధీ భవన్‌తో సెంటిమెంటల్, ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది” అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తి నిబద్ధతతో పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. “నా శాఖలో అద్భుతమైన పని జరుగుతోంది.
ఒక్క రోజు, ఒక్క గంట కూడా విరామం లేకుండా పని చేస్తున్నా” అని తెలిపారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. “బీఆర్ఎస్ హయాంలో మాటలు ఎక్కువ, పని తక్కువ” అని విమర్శించారు. నాటి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ బోగస్ అని కొట్టిపారేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటల కంటే చేతలకే ప్రాధాన్యం ఇస్తోందని, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని చెప్పారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
