Homeక్రైమ్ వార్తలుAyyappa Devotee | అయ్యప్ప భక్తుడికి తీరని అన్యాయం..

Ayyappa Devotee | అయ్యప్ప భక్తుడికి తీరని అన్యాయం..

  • విధి చేసిన వింత నాటకం..Ayyappa Devotee
  • మాల ధారణ సమయంలో కుప్పకూలిన భక్తుడు..

అయ్యప్ప స్వామి మాల ధరించి.. నలభై ఒక్క రోజుల పాటు దీక్ష చేపట్టేందుకు సిద్ధమైన ఓ భక్తుడికి విధి తీరని అన్యాయం చేసింది (Ayyappa Devotee). అయ్యప్ప స్వామి మాల ధరించేందుకు ఎంతో భక్తిశ్రద్ధలతో ఆలయానికి వచ్చిన భక్తుడు.. మాల ధారణ సమయంలోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లికి చెందిన లింబాద్రి.. సిరిసిల్ల పట్టణంలోని అయ్యప్ప దేవాలయానికి మాల ధరించేందుకు వచ్చాడు.

అయితే మాల ధారణ జరుగుతున్న సమయంలోనే ఒక్కసారిగా స్పృహ కోల్పోయి కిందపడిపోయాడు. వెంటనే అప్రమత్తమైన అయ్యప్ప భక్తులు లింబాద్రిని సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. చలికి ఫిట్స్ రావడంతోనే ఈ ఘటన జరిగినట్లు ప్రాథమికంగా వైద్యులు తెలిపినట్లు సమాచారం. అయ్యప్ప మాల ధరించి స్వామి సేవలో తరించాలని ఆశపడిన భక్తుడు.. మాల ధారణ సమయంలోనే ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES

Latest News