Homeభక్తిKarthika Deepam | తమసోమా జ్యోతిర్గమయ..

Karthika Deepam | తమసోమా జ్యోతిర్గమయ..

  • కార్తీక మాసంలో దీపాల కాంతులు..Karthika Deepam
  • తులసి కోట దగ్గర దీపం వెలిగించడం ఎంతో పవిత్రం..

కార్తిక మాసంలో ఇళ్లు, ఆలయాల్లో దీపాల కాంతులు విరజిమ్ముతాయి(Karthika Deepam). తెల్లవారుజామునే లేచి స్నానాలు ఆచరించి, తులసి కోట దగ్గర దీపం వెలిగించడం నుంచి సాయంత్రం వేళ ఇంటి ముందు ప్రమిదలు పెట్టడం వరకు ఈ నెలంతా దీపారాధనకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ముఖ్యంగా కార్తిక పౌర్ణమి రోజున నదులు, చెరువులు, ఆలయ ప్రాంగణాలు దీపకాంతులతో కళకళలాడుతాయి. పిండి దీపాలు, ఉసిరి దీపాలు, అరటి దొప్పల్లో దీపాలు వెలిగించి దీపదానం చేస్తారు. అయితే ఈ దీపారాధనలో ఉపయోగించే వత్తులకు కూడా ప్రత్యేకతలు ఉన్నాయని తెలుసా? ఒక్కో రకం వత్తి వెనుక ఒక్కో ఆచారం, విశ్వాసం దాగి ఉంది. మరి ఆ వత్తుల విశిష్టతలేమిటో తెలుసుకుందాం. దీపం వెలిగించడానికి సాధారణంగా పత్తి వత్తులను ఉపయోగిస్తాం. అయితే సంప్రదాయ పూజల్లో మరికొన్ని రకాల వత్తులకూ ప్రాధాన్యం ఉంది.

పత్తి వత్తులు : దూదితో తయారుచేసే ఈ వత్తులను నిత్యం ఇంట్లో దీపారాధనకు ఉపయోగిస్తారు. వీటితో దీపం వెలిగించడం వల్ల ఇంట్లో సుఖశాంతులు, ఐశ్వర్యం వెల్లివిరుస్తాయని భక్తుల విశ్వాసం.Karthika Deepam

- Advertisement -

తామర తూడు వత్తులు : తామర కాడ నుంచి తీసిన నారతో వీటిని తయారుచేస్తారు. తామర లక్ష్మీదేవికి ప్రతీకగా భావిస్తారు. అందుకే ఈ వత్తులతో దీపం వెలిగిస్తే అమ్మవారి అనుగ్రహం లభించి, ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయని నమ్ముతారు.

అరటి నార వత్తులు : అరటి చెట్టు కాండం నుంచి తీసిన నారతో వీటిని తయారుచేస్తారు. వీటిని వెలిగించడం వల్ల పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయని, సంతాన ప్రాప్తి, వంశాభివృద్ధి కలుగుతాయని కొన్ని ప్రాంతాల్లో విశ్వసిస్తారు.

జిల్లేడు వత్తులు : తెల్ల జిల్లేడు పూల నుంచి వచ్చే దూదితో వీటిని తయారుచేస్తారు. గణపతి, శివుడి పూజల్లో వీటికి ప్రాధాన్యం ఉంది. ఈ వత్తులతో దీపం వెలిగిస్తే విఘ్నాలు తొలగి, శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం.

కొత్త వస్త్రపు వత్తులు : కొత్త నూలు వస్త్రాన్ని పసుపు లేదా కుంకుమ కలిపిన నీటిలో తడిపి ఆరబెట్టి వీటిని తయారు చేస్తారు. వీటితో దీపం వెలిగించడం సౌభాగ్యానికి, శుభప్రదమైన ఆరంభాలకు సంకేతంగా భావిస్తారు.

ఇవేకాకుండా నిలువు వత్తి, అడ్డ వత్తి, పువ్వు వత్తి, రుద్రాక్ష వత్తి, గోపురం వత్తి, శివలింగ వత్తి, అష్టదళ పద్మ వత్తి వంటి వివిధ ఆకారాల్లో కూడా దాదాపు 26 రకాల వత్తులను తయారు చేస్తారు. దీపారాధనలో వత్తుల సంఖ్యకూ ప్రత్యేక స్థానం ఉంది. సాధారణంగా నిత్య పూజలో రెండు వత్తులను కలిపి దీపం వెలిగిస్తారు. ఐదు వత్తులతో దీపం వెలిగించడం పంచభూతాలకు ప్రతీకగా భావిస్తారు. మరికొన్ని ప్రాంతాల్లో ఏడు వత్తులతో దీపారాధన చేసే సంప్రదాయం ఉంది. అయితే వత్తుల సంఖ్య విషయంలో ప్రాంతాన్ని బట్టి ఆచారాలు మారుతుంటాయి.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News