Homeక్రైమ్ వార్తలుAnantapur bus accident | ప్రమాదానికి గురైన ప్రైవేట్ బస్..

Anantapur bus accident | ప్రమాదానికి గురైన ప్రైవేట్ బస్..

  • పరారైన బస్సు డ్రైవర్..Anantapur bus accident
  • రాప్తాడు మండల పరిధిలో ఘటన..Anantapur bus accident

అనంతపురం జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఒక (Anantapur bus accident) ప్రైవేట్ బస్సు ప్రమాదానికి గురైంది. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు ప్రయాణికులతో వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు రాప్తాడు మండల పరిధిలోని రామానేపల్లి సమీపంలో అదుపుతప్పి రోడ్డు పక్కకు బోల్తా పడింది. ఈ ఘటనలో దాదాపు 40 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ది హిందూ కథనం ప్రకారం… గురువారం తెల్లవారుజామున సుమారు 3:00 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు వేగంగా వెళుతున్న క్రమంలో అకస్మాత్తుగా అదుపు తప్పి బోల్తా పడటంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు, అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.

గాయపడిన ప్రయాణికులను వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందించారు. అయితే, ఎవరికీ ప్రాణాంతక లేదా తీవ్ర గాయాలు కాలేదని, ప్రయాణికులందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు, అధికార యంత్రాంగం స్పష్టం చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. అర్థరాత్రి సుదూర ప్రయాణం కావడం వల్ల డ్రైవర్ నిద్రమత్తులోకి జారడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమై ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News