Homeకరీంనగర్Government land encroachment | కోరుట్లలో ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు

Government land encroachment | కోరుట్లలో ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు

  • కోరుట్ల పట్టణంలోని బిలాల్‌పురాలో సర్వే నంబర్ 1245 ప్రభుత్వ భూమి కబ్జా…Government land encroachment
  • ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు జరుగుతున్నా పట్టించుకోని అధికారులు ..

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని బిలాల్‌పురా ప్రాంతంలో (Government land encroachment ) ప్రభుత్వ భూముల పరిరక్షణ ప్రశ్నార్థకంగా మారింది. సర్వే నంబర్ 1245లో ఉన్న ప్రభుత్వ భూమిని కొందరు వ్యక్తులు ఆక్రమించి, అందులో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారనే ఆరోపణలు స్థానికంగా వినిపిస్తున్నాయి.

Allegations of government land encroachment

ప్రభుత్వ భూములను కాపాడాల్సిన సంబంధిత శాఖల అధికారులు ఈ వ్యవహారంపై దృష్టి సారించడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురవుతున్నట్లు ఆరోపణలు ఉన్నప్పటికీ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి.

- Advertisement -

ఇప్పటికైనా రెవెన్యూ, మున్సిపల్ అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి సర్వే నంబర్ 1245 భూమిని కబ్జా చేసి అక్రమ నిర్మాణం ను వెంటనే నిలిపి వేసి చర్యలు తీసుకొవాలాన్ని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

ప్రభుత్వ భూముల పరిరక్షణ ప్రభుత్వ అధికారుల బాధ్యత కాదా…? ఆక్రమణలపై ఉన్నతాధికారులు ఎప్పుడు స్పందిస్తారో వేచి చూడాలి.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News