Homeకరీంనగర్Rythu Bharosa | రైతుల ఖాతాల్లో జమ కాని రైతు భరోసా..

Rythu Bharosa | రైతుల ఖాతాల్లో జమ కాని రైతు భరోసా..

  • ఫోన్లకు మాత్రం డబ్బులు జమ అయినట్లు మెసేజ్‌లు!
  • రైతుల్లో అయోమయం.. బ్యాంకు ఖాతాల్లో నగదు కనిపించక ఆందోళన

జగిత్యాల: రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా(Rythu Bharosa) పథకం విషయంలో రైతుల్లో అయోమయం నెలకొంది.జగిత్యాల జిల్లా లోని కొంతమంది రైతుల మొబైల్ ఫోన్లకు రైతు భరోసా డబ్బులు ఖాతాల్లో జమ అయినట్లు సందేశాలు వస్తున్నప్పటికీ, వాస్తవంగా బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తే నగదు జమ కాలేదని రైతులు చెబుతున్నారు.

ఫోన్లకు వచ్చిన మెసేజ్‌లను చూసి డబ్బులు వచ్చాయని భావించిన రైతులు బ్యాంకులకు వెళ్లి ఖాతాలను పరిశీలించగా నిరాశ ఎదురవుతోందని వాపోతున్నారు. అసలు నగదు జమ కాకుండానే డబ్బులు జమ అయినట్లు సందేశాలు ఎందుకు వస్తున్నాయో అర్థం కాక రైతులు అయోమయానికి గురవుతున్నారు.

- Advertisement -

ప్రభుత్వం నుంచి విడుదలైన నిధులు రైతుల ఖాతాలకు చేరాయా? లేక సాంకేతిక కారణాలతో సందేశాలు మాత్రమే వస్తున్నాయా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సంబంధిత అధికారులు స్పందించి రైతు భరోసా నగదు జమ ప్రక్రియపై స్పష్టత ఇవ్వాలని, అర్హులైన రైతులందరికీ వెంటనే నిధులు అందేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News