- శ్రీ పహాడి హనుమాన్ దేవాలయ అభివృద్ధి మరియు పరిరక్షణ కమిటీ
- గత పాలక మండలి హయాంలో అనేక అవతవకల జరిగాయి
- మే నెలలోనే దేవాదాయశాఖ అధికారులకు ఫిర్యాదు
- ఇప్పటి వరకు ఎటువంటి పురోగతి లేదు
- అభివృద్ధి కమిటీ 2012లో ఏర్పాటు అయ్యింది
- ఆలయాన్ని అనేక విధాలుగా అభివృద్ధి చేసాము
- నేటితో ఈ కమిటీ రద్దు చేస్తున్నాము
- చైర్మన్ నక్క మధు మధుసూదన్ రావు వెల్లడి
అడ్డగుట్ట: గత పాలక మండలి హయాంలో శ్రీ పహాడి హనుమాన్ దేవాలయంలో(Pahadi Hanuman Temple) అనేక అవకతవకలు జరిగాయని శ్రీ పహాడి హనుమాన్ దేవాలయ అభివృద్ధి మరియు పరిరక్షణ కమిటీ ప్రధాన కార్యదర్శి నక్క మధు సుధన్ రావు ఆరోపించారు. తుకారాం గేట్ లోని శ్రీ పహాడి హనుమాన్ దేవాలయ(Pahadi Hanuman Temple) ఆవరణలో సోమవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో అభివృద్ధి కమిటీ సభ్యులతో కలిసి నక్క మధు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి కోసం దాతలు ఇచ్చిన నిధుల దుర్వినియోగం జరిగిందని దేవాదాయ శాఖ కమీషనర్, డిప్యూటీ, అసిస్టెంట్ కమిషనర్లతో పాటు విజిలెన్స్ అధికారులకు కూడా గత మే నెలలోనే పిర్యాదు చేసినట్లు తెలిపారు. దేవాలయ ప్రతిష్టకు, భక్తుల మనోభావాలకు కూడా భంగం కలుగవద్దని ఉద్దేశ్యంతో తో అంతర్గతంగానే విచారణ జరిపి చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆశించినట్లు పేర్కొన్నారు. కానీ అధికారులు అలసత్వం వహిస్తూ ఎటువంటి చర్యలు తీసుకోకుండా కాలయాపన చేయడం శోచనీయం అని అన్నారు. గతంలో అవకతవకలకు పాల్పడిన వారే మళ్లీ కొత్త పాలకమండలిలో అవకాశం కల్పించాలని దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసిందని తప్పని సరి పరిస్థితుల్లోనే ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

గత పాలకమండలి హయాంలో చైర్మన్ ఎం లక్ష్మణ్ ప్రసాద్ ఆధ్వర్యంలో సభ్యులు అనేకమంది దాతల నుండి నిధులు సేకరించడం జరిగిందని, అందులో కొంతమంది వస్తూ రూపంలో విరాళాలు ఇవ్వగా అధిక శాతం మంది నగదు రూపంలోనే విరాళాలు ఇవ్వడం జరిగిందని చెప్పారు. నిబంధనల మేరకు దేవాలయానికి సంబంధించిన లావాదేవీల వ్యవహారాలు ఆలయ ఈఓ సమక్షంలోనే జరగాలి, వాటికి రసీదులు కూడా ఇవ్వాలి కానీ వీటికి పూర్తి విరుద్ధంగా గత పాలకమండలి వ్యవహరించిందని పేర్కొన్నారు.
లక్షల్లో విరాళాలు ఇచ్చిన దాతలకు రసీదులు ఇవ్వక పోవడమే కాకుండా ఆలయ ఆవరణలో దాతల పేర్లతో ఏర్పాటు చేసిన శిలాపాలకం పైన కూడా వారు ఇచ్చిన విరాళాల వివరాలు పొందపరచలేదని చెప్పారు. పైగా ఈ శిలాపలకంపైన దాతల పేర్లు, పాలకమండలి సభ్యుల పేర్లతో పాటు ఉండాల్సిన ప్రభుత్వ ప్రతినిధులైన ఆలయ ఈఓ, పురోహితుడి పేర్లు లేక పోగా ఆలయానికి ఎటువంటి సంబంధం లేని ప్రభుత్వం నియమించిన కమిటీకి ఒక అడ్వైజర్ ను నియమించుకొని అతడి పేరు కూడా శిలాపలకంపైన నమోదు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ శిలాపలకంపైన కూడా కేవలం 20మంది దాతల పేర్లు మాత్రమే నమోదు అయ్యాయని, విరాలమిచ్చి శిలాపలకం పైన చోటు లభించని వారు ఇంకా చాలా మంది ఉన్నారనే విషయం తమ దృష్టికి వచ్చిందని వివరించారు. ఇప్పటికైన స్పందించి సమగ్ర విచారణ జరిపి నిజానిజాలను బహిర్గతం చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. తద్వారా భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా రాబోయే రోజుల్లో స్వామివారికి ఇచ్చే విరాళాలు సక్రమంగా దేవాలయ అభివృద్ధికే వినియోగించపడతాయనే నమ్మకం కల్పించాల్సిన బాధ్యత ఉందని స్పష్టం చేశారు.
అభివృద్ధి కమిటీ చరిత్ర
దేవాలయ అభివృద్ధి కమిటీ 2012 లో ఏర్పాటు చేయడం జరిగిందని, ఆలయ పరిరక్షణతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని వివరించారు. అప్పటినుండి కూడా ఆలయ సేవకులుగానే ఉన్నామని, ఆలయ అభివృద్ధిలో తాము కూడా భాగస్వాములు అవుతామని అనేక మంది ఆసక్తి చూపుతున్నారని కొత్త వారికి కూడా అవకాశం కల్పించాలనే ఉద్దేశ్యంతో ఈ కమిటీని రద్దు చేస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే యువకులకు ప్రాధాన్యత నిస్తూ కొత్త కమిటీ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

ఆలయ చరిత్ర
ఈ సందర్భంగా మాజీ చైర్మన్ శ్రీ రాములు మాట్లాడుతూ 1827లో వెలసిన స్వయంభూ హనుమాను దేవాలయం ఇది అని తెలిపారు. గుట్టపైన ఆలయం ఉండడంతో ఇది పహాడి హనుమాను దేవాలయంగా గుర్తింపు పొందడం జరిగిందని పేర్కొన్నారు. జంట నగరాలలోనే ఇటువంటి ఆలయం లేదంటే అతిశయోక్తి కాదన్నారు. ఇక్కడి ఆలయ పరిసర ప్రాంతాల్లో అడుగు పెడితే అడవి ప్రాంతంలో ఉన్న అనుభూతి కలుగుతుందని చెప్పారు.
ఇప్పటికి కార్తీక మాసంలో దూరప్రాంతాల్లోని వ్యక్తులు స్వాములు, కుటుం సభ్యులతో కలసి ఇక్కడికి వచ్చి స్వామి దర్శనం చేసుకోవడంతో పాటు ఇక్కడే సేద తిరుతుంటారని తెలిపారు. వచ్చే సంవత్సరం నాటికి రెండు శతాబ్దాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయడంతో పాటు ఘనంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని బావిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో ఆలయ అభివృద్ధి పరిరక్షణ కమిటీ సభ్యులు ఆర్ మల్లేష్, జీ నర్సింగ్ రావు, శివ కుమార్, వెంకటేష్ గౌడ్, బీ విజయ్ కుమార్, రమేష్ బాబు, ప్రవీణ్ పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
