ప్రకృతి ప్రసాదించిన జీవనది
ఇసుక మేటల మధ్య ఊపిరిసలుపుకోలేక
తల్లడిల్లుతుంటే… కృష్ణమ్మ, గోదావరి ఒడ్లు
దాహంతో అల్లాడిపోతున్నాయి. ఎల్నినో విసిరిన
కరువు పంజాకు వరుణ దేవుడు కరుణించక,
రాష్ట్రంలోని రిజర్వాయర్లు
అడుగంటిపోయాయి. సాధారణం
కంటే 27 శాతం తక్కువ వర్షపాతంతో.
324 మండలాల్లో భూగర్భ జలాలు
అట్టడుగుకు పడిపోయి…
నిండు కుండలాంటి భాగ్యనగరం
నేడు నీటి బొట్టూ లేక గొంతు
తడుపుకోవడానికి కన్నీరు పెట్టుకుంటోంది.
ప్రతి పౌరుడూ నీటిని ఒంటి పూట
వెలుతురులా కాపాడుకోవాల్సిన
సామూహిక ధర్మం, దాహార్తంతో
అల్లాడుతున్న ఈ నగరానికి, వృథా
అరికట్టే మన చైతన్యమే నేడు ఏకైక జీవధార.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
Aaj Ki Baath
- Advertisement -
