Homeవరంగల్‌Adivasi Rights | హక్కుల కోసం ఉద్యమించాలి...

Adivasi Rights | హక్కుల కోసం ఉద్యమించాలి…

  • తుడుం దెబ్బ మండల కమిటీ ఏకగ్రీవం…
  • ఆదివాసి విద్యార్థి, మహిళా రైతు సంఘాలు ఎన్నిక…
  • డిసెంబర్ 9 చలో హైదరాబాద్ భారీ బహిరంగ సభకు పిలుపు…
  • తుడుందెబ్బ జాతీయ ఉపాధ్యక్షులు పోడెం బాబు…

ఆదివాసి హక్కుల(Adivasi Rights) కోసం ప్రతి ఆదివాసి గూడెం లోని యువకులంతా ఉద్యమించాలని తుడుం దెబ్బ జాతీయ ఉపాధ్యక్షులు పొడెం బాబు అన్నారు. వెంకటాపురం మండల కేంద్రంలోని రహదారులు, భవనాలు అతిథి గృహ ఆవరణలో మంగళవారం ఆదివాసి హక్కుల(Adivasi Rights) పోరాట సమితి తుడుం దెబ్బ నూతన మండల కమిటీనీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. రాష్ట్ర ఉపాధ్యక్షులు పులిసే బాలకృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా తుడుం దెబ్బ జాతీయ ఉపాధ్యక్షులు పొడెం బాబు హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

ఆదివాసీల అస్తిత్వం కోసం యువతీ, యువకులు ప్రతి ఆదివాసి గూడెం నుండి ముందు వరసలో ఉండాలన్నారు. డిసెంబర్ 9 చలో హైదరాబాద్ భారీ బహిరంగ సభకు వెంకటాపురం మండలం నుంచి పిలుపు నిచ్చారు. ఏజెన్సీ ప్రాంతాల్లో దోపిడీకి గురి అవుతున్న నీరు, అడవి, భూమి, విద్య, వైద్యం, ఉద్యోగాల విషయంలో ఉద్యమించాలని కోరారు.

- Advertisement -

అనంతరం తుడుం దెబ్బ మండల కమిటీ, ఆదివాసి విద్యార్థి, రైతు, మహిళ సంఘాల మండల కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

తుడుం దెబ్బ మండల కమిటీ…..

మండల అధ్యక్షుడిగా పూనెం శ్రీకాంత్, గౌరవ అధ్యక్షులుగా పూనెం గోవర్ధన్, ప్రధాన కార్యదర్శిగా ఎలకం సాగర్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా మిచ్చ సురేష్, ఉపాధ్యక్షులుగా రేగ నరేష్, సున్నం నాగేంద్ర, కో ధని కుమార్, కోశాధికారిగా కొంచెం నరేందర్, సహాయ కార్యదర్శులుగా కారం సాయి తేజ, మడకం రమేష్, కార్యవర్గ సభ్యులుగా సోడే శ్రీను, కాపుల వెంకటేశ్వర్లు ఎన్నికయ్యారు.

ఆదివాసి విద్యార్థి సంఘం….

మండల అధ్యక్షుడిగా గట్టుపల్లి అశోక్, ప్రధాన కార్యదర్శిగా పాయం శశికుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా పర్షిక అనిల్, ఉపాధ్యక్షులుగా కెక్కెం తేజ, సహాయక కార్యదర్శులుగా పంది మనోజ్, తాటి వెంకటేశ్వర్లు, కార్యవర్గ సభ్యులుగా మేకల మహేష్, సురటి శివశంకర్, కోర్స రాజ్ కుమార్ ను ఎన్నుకున్నారు.

ఆదివాసి రైతు సంఘం…..

గౌరవ అధ్యక్షులుగా పూనెం మునేశ్వరరావు, మండల అధ్యక్షుడిగా సొర్లం ఆదినారాయణ, ఉపాధ్యక్షులుగా పూజారి నరసింహారావు, కంతి వెంకయ్య ఎన్నికయ్యారు.

ఆదివాసి మహిళా సంఘం….

గౌరవ అధ్యక్షులుగా తాటి బుచ్చమ్మ, మండల అధ్యక్షులుగా పర్సిక సమ్మక్క, ప్రధాన కార్యదర్శిగా మడి రమాదేవి, ఉపాధ్యక్షులుగా పర్షిక దీపిక, ఆలం సమ్మక్క, సహాయ కార్యదర్శిగా మిచ్చ అనిత, పూనమ్ ఝాన్సీ, ఎర్రం స్వప్న, తాటి సుభద్ర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకత్వం ఎన్నికైన మండల నాయకత్వానికి పలు సూచనలు చేశారు. ప్రతి గ్రామంలో నుండి గ్రామ కమిటీలను ఎన్నుకోవాలని సూచించారు. కింది స్థాయి నుండి సంఘాన్ని బలోపితం చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఆదివాసి విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొప్పుల రవి, ఆదివాసి మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు అట్టం సుభద్ర, తుడుం దెబ్బ రాష్ట్ర ప్రచార కార్యదర్శి రేగ గణేష్, తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షులు నల్ల బోయిన లక్ష్మణరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ పూనెం చంటి, ఉపాధ్యక్షులు పద్దం సుధాకర్, ఆదివాసి విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు దబ్బకట్ల శ్రీకాంత్, తుడుం దెబ్బ డివిజన్ అధ్యక్షులు పోడెం శోభన్, ఆదివాసి విద్యార్థి సంఘం జిల్లా నాయకులు పాయం పూర్ణచందర్, తుడుం దెబ్బ సీనియర్ నాయకులు యాలం సాయి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పూనం వరప్రసాద్, ఆదివాసి యువత, యువకులు, ప్రజలు వందల సంఖ్యలో పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News