Homeనిజామాబాద్‌Housing Bills Inspection | ఏండ్రియాల్‌లో ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల పరిశీలన

Housing Bills Inspection | ఏండ్రియాల్‌లో ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల పరిశీలన

తాడ్వాయి: తాడ్వాయి మండల పరిధిలోని ఏండ్రియాల్ గ్రామంలో మంగళవారం ఇందిరమ్మ ఇళ్ల బిల్లులపై అధికారుల బృందం క్షేత్రస్థాయి పరిశీలన (Housing Bills Inspection)చేపట్టింది. హౌసింగ్ డీఈ, ఏఈలు స్థానిక సర్పంచ్, పంచాయతీ కార్యదర్శితో కలిసి గ్రామంలోని 13 ఇందిరమ్మ ఇళ్లను స్వయంగా సందర్శించారు.

గృహ నిర్మాణాల పురోగతిని పరిశీలించడంతో పాటు, ఇప్పటివరకు మంజూరైన బిల్లుల వివరాలను లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. పలువురు లబ్ధిదారులకు సంబంధించి ఆఖరి విడత బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించిన అధికారులు, క్షేత్రస్థాయి నివేదిక ఆధారంగా విచారణ పూర్తి చేశారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులను త్వరలోనే లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తామని అధికారులు ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నర్సింలు, పంచాయతీ కార్యదర్శి సాహిత్య, హౌసింగ్ ఏఈ సుచరిత తదితరులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News