- బిజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డా. వైభవ్ రెడ్డి.
ఓటరు జాబితా ప్రక్షాళనను రాజకీయం చేయొద్దని, ఓటరు జాబితా ప్రక్షాళనను రాజకీయ కోణంలో కాకుండా ప్రజాస్వామ్య పరిరక్షణ దిశగా చూడాలని బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డా. వైభవ్ రెడ్డి (Dr Vaibhav Reddy) అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండాలనే సూత్రానికి అనుగుణంగా నకిలీ, ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాల్లో నమోదైన ఓట్లను గుర్తించి సరిచేయాల్సిన అవసరముందన్నారు.
ఓట్లు తొలగించారంటూ ఆరోపణలు చేసే రాజకీయ పార్టీలు నిర్దిష్ట ఆధారాలతో తమ అభ్యంతరాలను వెల్లడించాలని సూచించారు. అర్హత కలిగిన ప్రతి భారతీయ పౌరుడికి ఓటు హక్కు కల్పించడంతో పాటు, అనర్హమైన నమోదులకు తావులేకుండా చూడాలని పేర్కొన్నారు. ఓటు తొలగినట్లు భావించే అర్హులు సంబంధిత ఎన్నికల అధికారులను సంప్రదించి, అవసరమైన గుర్తింపు పత్రాలతో తిరిగి నమోదు చేసుకోవచ్చని తెలిపారు. తొలగించిన ఓట్లన్నింటినీ తిరిగి చేర్చాలనే డిమాండ్ల వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని విమర్శించారు. భారతదేశం ధర్మసత్రం కాదని, దేశ పౌరులకే రాజ్యాంగబద్ధమైన ఓటు హక్కు వర్తిస్తుందని, విదేశీయులు లేదా అనర్హుల పేర్లకు ఓటరు జాబితాలో చోటు ఉండకూడదని డా. వైభవ్ రెడ్డి (Dr Vaibhav Reddy) స్పష్టం చేశారు. ఒక వ్యక్తికి ఒకే ఓటు, అర్హుడైన ప్రతి భారతీయ పౌరుడికి ఓటు హక్కు ఉండాలన్నదే ప్రజాస్వామ్య స్ఫూర్తి అని పేర్కొన్నారు. (https://epaper.aadabhyderabad.in/)(Youtube)
