Homeమెదక్‌Narsapur MLA | గిరిజన తండాల అభివృద్ధికి కృషి చేసిన ఘనత కేసీఆర్‌దే

Narsapur MLA | గిరిజన తండాల అభివృద్ధికి కృషి చేసిన ఘనత కేసీఆర్‌దే

  • ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి

గిరిజన తండాల అభివృద్ధికి విశేష కృషి చేసిన ఘనత మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కే దక్కుతుందని నర్సాపూర్‌ ఎమ్మెల్యేసునీత లక్ష్మారెడ్డి(Narsapur MLA Sunitha Laxma Reddy) అన్నారు. ఎస్టీల రిజర్వేషన్‌ను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచిన ఘనత కేసీఆర్‌దేనని పేర్కొన్నారు.గురువారం చిలిపిచేడ్ మండలంలోని ఫైజాబాద్‌ గ్రామంలో ఎమ్మెల్యే కోటాలో మంజూరైన చాకలి యాదయ్య ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు.

కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం

- Advertisement -

అనంతరం గణ్య తండాలో ఎస్టీల రిజర్వేషన్‌ 10 శాతానికి పెంచి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. తండాలను ప్రత్యేక గ్రామపంచాయతీలుగా మార్చి అభివృద్ధికి బాటలు వేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు.

సంక్షేమ పథకాలతో అండ

కల్యాణలక్ష్మి,షాదీ ముబారక్‌ వంటి పథకాలతో పేద కుటుంబాలకు, ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించారని తెలిపారు.విదేశీ విద్యను అభ్యసించే విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు పెంచి ప్రోత్సహించారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు అశోక్‌రెడ్డి,ఉపాధ్యక్షుడు బెస్త లక్ష్మణ్‌, సర్పంచులు నీలా పాండు,కున్యా,దార్జ్య, మాజీ సర్పంచులు రాకేష్‌,శంకర్‌, యాదగిరి, గోపాల్‌రెడ్డి,నాయకులు సంగాగౌడ్‌, ఎంసీ విఠల్‌, షఫీ, ధర్మారెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, ముకుందరెడ్డి, శంకరయ్య,బాల్‌రెడ్డి, విభీషన్,ఎంపీఓ మునీరుద్దీన్, హౌసింగ్ ఏఈ అభిషేక్, రెవెన్యూ ఆర్ఐ శ్రీహరి,కార్యదర్శి నాగరాజు‌ తదితరులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News