- వినాయక మండపాల వద్ద రోత పుట్టిస్తున్న వెర్రి చేష్టలపై అధికారుల మొద్దునిద్ర వీడేదెన్నడు?
సదాశివపేట పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో వినాయక ఉత్సవాల పేరిట సాగుతున్న అరాచకం పరాకాష్టకు చేరింది. పవిత్రమైన పూజా వేదికలు కాస్తా రోత పుట్టించే వికృత చేష్టలకు, పైత్యానికి అడ్డాలుగా మారుతుండటంపై సర్వత్రా ఆగ్రహజ్వాలలు వ్యక్తమవుతున్నాయి.
నాడు భక్తి.. నేడు ఈ కాలపు దరిద్రం: నాడు వినాయక మండపాలు, నిమజ్జనం అంటే భజనలు, కీర్తనలు, కోలాటాలతో మార్మోగేవి. నేటి పాడు పోకడలను చూసి పెద్దవాళ్లు “అప్పటి భక్తి ఎక్కడ? ఇప్పటి ఈ దరిద్రపు గొట్టు చిందులు ఎక్కడ? ఇదేం విడ్డూరం రా బాబూ!” అని ఛీత్కరించుకుంటున్నారు.Where Is Devotion
సదాశివపేటలో ఐదారు గుళ్లల్లోనే మిగిలిన పవిత్రత: “సదాశివపేట పట్టణంలో కేవలం ఒక ఐదారు గుళ్లల్లో మాత్రమే ఆ నాటి నిజమైన భక్తి, పవిత్రత కనిపిస్తున్నాయి.. చుట్టుపక్కల గ్రామాల్లో గీ ఒకటి రెండు చోట్ల తప్ప, తతిమా అన్ని మండపాల కాడ దేవుడి భక్తి పక్కకుపోయి బరితెగింపు, రోత పనులే రాజ్యమేలుతున్నాయి” అంటూ ఊరి పెద్దలు, వృద్ధులు తీవ్ర ఆవేదనతో వాపోతున్నారు. ఆడామగా తేడాలేని వెర్రి గెంతులు: మహిళలు, పిల్లలు, పెద్దలు అనే విచక్షణే లేకుండా.. కర్ణకఠోర శబ్దాల హోరుకు నడిరోడ్డుపై ఎవరికివారే పిచ్చి గెంతులు వేస్తూ, వికారమైన చేష్టలతో సంస్కృతిని బజారుకీడుస్తున్నారు.
సామాజిక మాధ్యమాల పిచ్చి – ముఖపుస్తకం, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ విన్యాసాలు: భక్తి పక్కకుపోయి ముఖపుస్తకం మెప్పుల కోసం, ఇన్స్టాగ్రామ్ లఘు చిత్రాల కోసం, వాట్సాప్ అంతస్థుల పైత్యం కోసం వెంపర్లాట పీక్స్‌కు చేరింది. వైరల్ అవ్వాలనే పిచ్చితో మండపాల ఎదుట వింత వికృత విన్యాసాలు చేస్తూ నవ్వులపాలవుతున్నారు.
అధికారుల మొద్దునిద్ర – ఇకనైనా కొరడా ఝళిపించండి: పట్టణంతో పాటు పల్లెల్లో ఇంత బరితెగింపు జరుగుతున్నా రక్షకభట, పురపాలక, రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారా? ఇప్పటికైనా మొద్దునిద్ర వీడి ప్రతి మండపం వద్ద గట్టి నిఘా పెట్టాలి. పవిత్రతను బలితీసుకుంటూ వెర్రి చేష్టలకు పాల్పడే వారిపై కఠిన కేసులు పెట్టి, భారీ జరిమానాలతో ఉక్కుపాదం మోపాలి.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
