మండలంలోని అజ్జమరి గ్రామంలో(Ajjamarri Village) మద్యం విక్రయాలను నిషేధించాలని కోరుతూ గ్రామస్తులు స్థానిక ఎస్సై నర్సింలుకు వినతిపత్రం అందజేశారు. గ్రామంలో మద్యం విక్రయాలు,సేవనం కారణంగా పలు కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని గ్రామస్తులు ఎస్సై దృష్టికి తీసుకెళ్లారు.మద్యం కారణంగా యువతపై ప్రతికూల ప్రభావం పడటంతో పాటు కుటుంబాల్లో ఆర్థిక, సామాజిక సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు.
గ్రామంలో మద్యం విక్రయాలను నియంత్రించి, అనధికారికంగా మద్యం విక్రయించే వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొనేలా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. మద్యం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు అండగా నిలిచి,గ్రామంలో మద్యం నిషేధానికి చర్యలు చేపట్టాలని కోరారు.వినతిపత్రాన్ని స్వీకరించిన ఎస్సై నర్సింలు గ్రామస్తుల సమస్యను పరిశీలించి, నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పరశురాం రెడ్డి,బిక్షపతి,సతీష్ తదితరులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
