HomeతెలంగాణBandi Sanjay | బీఆర్ఎస్ భూముల్లో కాషాయ జెండా ఎగరేసి.. పేదలకు పంచిపెడతాం

Bandi Sanjay | బీఆర్ఎస్ భూముల్లో కాషాయ జెండా ఎగరేసి.. పేదలకు పంచిపెడతాం

  • ఏఐసీసీకి ఈఎంఐ కట్టేందుకే బీఆర్ఎస్ భూముల చిట్టా విప్పారు
  • అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ కు ఓపెన్ ఆఫర్ ఇస్తున్నారా
  • కేసీఆర్ ఫాంహౌజ్ లో సర్కార్ భూమి ఉందని తేల్చడానికి 33 నెలలు పట్టిందా?
  • భూముల విచారణ పేరుతో బీఆర్ఎస్ తో కాంగ్రెస్ చీకటి ఒప్పందం ఖాయం
  • యూపీ ఎన్నికల కోసం అవసరమైన డబ్బులను బీఆర్ఎస్ సర్ధడం తథ్యం
  • కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ దోచుకున్న భూములపై బీజేపీ ఆధ్వర్యంలో దండ యాత్ర చేస్తామని ప్రకటించారు. ఆ భూముల్లో కాషాయ జెండా ఎగరేసి పేదలకు పంచి పెడతామని చెప్పారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ భూదోపిడీని సీఎం ప్రస్తావించడం వెనుక పెద్ద మతలబు ఉందన్నారు. యూపీ ఎన్నికల నేపథ్యంలో ఏఐసీసీకి ఈఎంఐ కట్టేందుకే అసెంబ్లీలో బీఆర్ఎస్ భూదోపిడీని ప్రస్తావించి ఆ పార్టీతో బేరసారాలకు సిద్ధమయ్యారని చెప్పారు. ఈరోజు కరీంనగర్ జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, నగర మేయర్, డిప్యూటీ మేయర్ లతో కలిసి కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay)మానకొండూరు, చింతకుంట, కొత్తపల్లి ప్రాంతాల్లో పర్యటఇంచి గణేశ్ నిమిజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. ప్రజలకు ఇబ్బందుల్లేకుండా ఉత్సాహంగా నిమజ్జనోత్సవాలు జరుపుకునేలా గణేష్ నిమజ్జన ఏర్పాట్లను చేయాలని అధికారులను కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఏమన్నారంటే…

కరీంనగర్ లో గణేశ్ నిమజ్జన ఉత్సవాల కోసం రూ.1.5 కోట్లను కేటాయించాం. గతేడాదితో పోలిస్తే మూడింతలు ఎక్కువ నిధులు కేటాయించాం. కరీంనగర్ ను కాషాయ మయం చేస్తాం. నిమజ్జనానికి అవసరమైన క్రేన్లను అందుబాటులో ఉంచుతాం. మిరుమిట్లు గొలిపేలా లైటింగ్ ఏర్పాటు చేస్తాం. నిమజ్జనానికి ఇబ్బంది లేకుండా 3రోజుల ముందే నీళ్లను విడుదల చేయాలి. ప్రజల సెంటిమెంట్ తో ఆటాలాడితే సహించే ప్రసక్తే లేదు. గణేశ్ నిమజ్జన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ప్యాచ్ వర్క్ కూడా పూర్తయ్యింది. ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆనందోత్సవాలతో నిమజ్జన ఉత్సవాలు జరుపుకోవాలి. హంగు అర్భాటాలతో ఉల్లాసంగా, ఆధ్యాత్మికత ఉట్టిపడేలా నిమజ్జన ఉత్సవాలు నిర్వహిస్తాం.

- Advertisement -

అసెంబ్లీలో సీఎం వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగిస్తోంది. బీఆర్ఎస్ కు సంబంధించి 8గురు ఎమ్మెల్యేల భూభాగోతం గురించి మాట్లాడటానికి గంట సమయం పట్టింది. మరి 90 మంది ఎమ్మెల్యేల భూభాగోతం గురించి మాట్లాడాలంటే ఎన్ని రోజులు అసెంబ్లీ నిర్వహించాలి. తెలంగాణలో 60 శాతం మంది ప్రజలకు భూముల్లేవు. 25 లక్షల కుటుంబాలకు ఇల్లు కట్టుకోవడాని గజం జాగా కూడా లేదు. కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం వేల ఎకరాల భూములను దోచుకున్నారు.

పాదయాత్రలో నేను బీఆర్ఎస్ భూదోపిడీ గురించి మాట్లాడితే కేసీఆర్ నా తలను 6 ముక్కలు చేస్తానన్నారు. అయినా కేసీఆర్ మెడలు వంచి ఫాంహౌజ్ నుండి గుంజుకొచ్చి ప్రజల ముందుంచిన. బీఆర్ఎస్ నేతలు వేల ఎకరాల భూమిని కబ్జా చేశారని చెప్పడానికి వెయ్యి రోజులు పట్టిందా సీఎంగారు. బీఆర్ఎస్ నేతలతో డీల్ కుదరలేదా?. ఏఐసీసీకి కట్టాల్సిన ఈఎంఐ గడువు ముంచుకొస్తుండటంతో ఒత్తిడి పెరిగిందా. అసెంబ్లీ వేదికగా వివరాలు బయటపెట్టి బీఆర్ఎస్ నేతలకు ఓపెన్ ఆఫర్ ఇస్తున్నారా?. అసెంబ్లీ సాక్షిగా సిట్ పేరుతో మీరు నియమించిన విచారణ కమిటీలు ఏమయ్యాయి?.

బేరాలు కుదరగానే సిట్ ను నీరుగార్చడం సీఎంకు అలవాటే కదా. సీఎం సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ లా కమిటీలు మారాయి. ఈ భూములపై కూడా విచారణ పేరుతో ఇంకెన్నాళ్లు లాగుతారు. జిల్లాల కలెక్టర్లకు పూర్తి అధికారాలిస్తే… 24 గంటల్లో పూర్తి నివేదిక ఇస్తారు. 30 రోజుల గడువు పేరుతో డీల్ కుదుర్చుకోవాలనుకుంటున్నారా.

విద్యుత్ కొనుగోళ్లు, ఈ ఫార్ములా రేసు, కాళేశ్వరం, గొర్రెల స్కాంసహా కేసులన్నీ ఏమయ్యాయి?. ఫారెస్ట్ భూములను కబ్జా చేసిన వాళ్లపై చర్యలేవి. పేదలు ఫారెస్ట్ ల్యాండ్స్ లో సాగు చేస్తే నానా ఇబ్బందులు పెడతారు కదా. వందల ఎకరాల ఫారెస్ట్ భూమిని కబ్జా చేస్తే చర్యలేవి.

తెలంగాణను అభివ్రుద్ధి చేయాలని మోదీ తాపత్రయపడుతున్నారు. అందులో భాగంగా బుల్లెట్ ట్రైన్లను మంజూరు చేస్తే… వాటికి కేటాయించిన భూములను సైతం బీఆర్ఎస్ కబ్జా చేశారు. బీఆర్ఎస్ వేల ఎకరాల భూములను దోచుకుంటే… వాళ్లతో బేరాలాడటమే మీ పనా?. కేసీఆర్ ఫాంహౌజ్ లో ప్రభుత్వ భూమి ఉందని తెలియడానికి 33 నెలలు పట్టిందా. రూ.లక్షల కోట్ల విలువైన ఆ భూములను ఎందుకు స్వాధీనం చేసుకోవడం లేదు*

ఏఐసీసీకి ఈఎంఐ కట్టేందుకే బీఆర్ఎస్ భూముల చిట్టా విప్పారని ప్రజలకు అర్ధమైంది. భూముల విచారణ పేరుతో బీఆర్ఎస్ తో చీకటి ఒప్పందం ఖాయం. యూపీ ఎన్నికల కోసం అవసరమైన డబ్బులను బీఆర్ఎస్ సర్ధడం తథ్యం. బీఆర్ఎస్ దోచుకున్న భూములపై బీజేపీ దండయాత్ర చేస్తాం. ఆ భూములను స్వాధీనం చేసుకుని పేదలకు పంచి పెడతాం. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు దొందూ దొందే.

సీఎం మాట చెబితేనే అది శాసనం కావాలి. కానీ బీఆర్ఎస్ తో బేరసారాల కోసం భూదోపిడీని వాడుకోవడం సిగ్గు చేటు. తెలంగాణ ప్రజలు ఛీకొడుతున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల చీకటి ఒప్పందాలపై జనం తిరగబడే రోజులు రాబోతున్నాయి. బీజేపీ ఆధ్వర్యంలో అతి త్వరలోనే బీఆర్ఎస్ నేతలు దోచుకున్న భూములపై దండయాత్ర చేస్తాం. ఆ భూములను పేదలకు పంచిపెడతాం.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News